Photo puzzle: ఈ ఫోటోలో దాగి ఉన్న Tiger ని గుర్తించగలరా ?
Viral photo of Tiger hiding in bush: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఇది ఒక ఫోటో పజిల్ అని చెప్పొచ్చు. ఈ ఫోటో వైరల్ అవడం వెనుకున్న కారణాలు ఎన్నో ఉండగా.. అందులో అతి ముఖ్యమైనది ఏంటంటే.. ఫోటోలో చూపిస్తున్న పొదల్లో దాగి ఉన్న పులిని గుర్తించడం అతి కష్టంగా మారడమే.
Viral photo of Tiger hiding in bush: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఇది ఒక ఫోటో పజిల్ అని చెప్పొచ్చు. ఈ ఫోటో వైరల్ అవడం వెనుకున్న కారణాలు ఎన్నో ఉండగా.. అందులో అతి ముఖ్యమైనది ఏంటంటే.. ఫోటోలో చూపిస్తున్న పొదల్లో దాగి ఉన్న పులిని గుర్తించడం అతి కష్టంగా మారడమే. మిజోరంలోని డంపా టైగర్ రిజర్వులో అతికష్టం మీద కెమెరాట్రాప్స్‌కి చిక్కిన ఫోటో ఇది.
డంపా టైగర్ రిజర్వ్ ఫారెస్టులో ఫారెస్ట్ గార్డుగా పనిచేస్తున్న జుఖుమ డాన్ అనే వ్యక్తి అమర్చిన కెమెరాట్రాప్‌కి ఈ ఫోటో చిక్కింది. దీనిని ఏడేళ్ల కాలంలో చిక్కిన ఫస్ట్ ఫోటోగ్రాఫిక్ రికార్డుగా డంపా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారవర్గాలు ప్రకటించడం మరో విశేషం.
Also read : Viral news: నదిలో తేలుతూ వచ్చిన పెట్టె.. తెరిచే చూస్తే దేవతల ఫోటోలతో పసికందు
How tiger's images captured: కెమెరాకు ఈ ఫోటో ఎలా చిక్కిందంటే..
ఇదే ఏడాది ఫిబ్రవరి నెలలో కెమెరా ట్రాప్ అమర్చిన జుఖుమ.. మూడు నెలల తర్వాత మే నెలలో మధ్యలో ఆ కెమెరాకు చిక్కిన ఫోటోలను పరిశీలిస్తుండగా ఈ ఫోటో కనిపించింది. ఈ ఫోటోలో టైగర్ ఉంది అని చెబితే కూడా గుర్తుపట్టడానికి వీల్లేని విధంగా ఉన్న ఈ ఫోటోలో ఉన్న టైగర్ ని జుఖుమ గుర్తించాడు. ఆ ఫోటోలో టైగర్ ఉందనే విషయాన్ని ధృవీకరించుకునేందుకు ఆ ఫోటోను తన పై అధికారులకు పంపించాడు. ఆ తర్వాత వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసిస్ (Wildlife Institute of India’s Department of Endangered Species Management) అధికారులు అది నిజమేనని ధృవీకరించారు.
ఈ టైగర్ ఫోటో పజిల్ వెనుకున్న మొత్తం స్టోరీని సాంక్చురి ఏషియా తమ ఇన్‌స్టాగ్రామ్ (Instagram post) ఖాతాలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఈ ఫోటోలో మీకు పులి కనిపించిందా లేదా ? లేదంటే మరోసారి చెక్ చేయండి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఫోటోను చూసిన నెటిజెన్స్.. ఇది ఫోటో పజిల్ మాత్రమే కాదు... కంటి పరీక్ష (Eye sight checkup) కూడా అని కామెంట్స్ రాస్తున్నారు. ఇప్పుడు అది చెక్ చేసుకోవడం మీ వంతే మరి.
Also read: Aadhaar and pan card link: పాన్‌కార్డ్‌ను ఆధార్ కార్డుతో ఎలా లింక్ చేయాలో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook