SBI Custmoers Alert: ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల వినియోగం విరివిగా పెరిగిపోవడంతో అవే సామాజిక మాధ్యమాలను ఆధారంగా చేసుకుని ఫేక్ మెసేజులు సర్క్యూలేట్ చేయడం కూడా అంతే ఎక్కువైంది. అలా వైరల్ అయ్యే ఫేక్ మెసెజులు, ఫేక్ ఈమెయిల్స్ గురించి అవగాహన లేకపోవడంతో అందులో పేర్కొన్న వివరాలు నిజమని నమ్మి ఆ లింకులపై క్లిక్ చేసి మోసపోతున్న వారి సంఖ్య కూడా కోకొల్లలుగా ఉంది. అలా లింకుపై క్లిక్ చేసి భారీ మొత్తంలో బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును పోగొట్టుకున్న వారిని, అలా ఇంకెవ్వరూ మోసగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు కేంద్రం తరపున ఫ్యాక్ట్ చెక్ పేరిట ఒక ట్విటర్ హ్యాండిల్ కూడా రన్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మోసాలు, ఫేక్ మెసేజులు, ఫేక్ ఈమెయిల్స్ లింక్స్ గురించి హెచ్చరించి జనం మోసగాళ్ల బారిన పడకుండా చూడటమే ధ్యేయంగా ఈ ఫ్యాక్ట్ చెక్ ట్విటర్ హ్యాండిల్ పనిచేస్తోంది. తాజాగా పీఐబి ఫ్యాక్ట్ చెక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు సంబంధించిన ఫేక్ మెసేజ్, ఫేక్ ఈమెయిల్స్ స్కామ్‌ని బయటపెట్టింది. 


పీఐబి ఫ్యాక్ట్ చెక్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం ఇటీవల కాలంలో ఓ ఫేక్ మెసేజ్ వైరల్ అవుతోంది. అందులో ఏం రాసి ఉందంటే.. మీ ఎస్బీఐ బ్యాంకు ఎకౌంట్ ఇవాళ క్లోజ్ అయిందని.. తిరిగి ఖాతాను ఓపెన్ చేయాలంటే మీ బ్యాంకు ఎకౌంటుని పాన్ కార్డుతో జత చేయాలని ఆ ఫేక్ మెసేజ్, ఫేక్ ఈమెయిల్స్ లో రాసి ఉంది. వెంటనే మీ బ్యాంకు ఎకౌంట్, పాన్ కార్డు జత చేయండని సూచిస్తూ అందుకోసం ఓ లింకు కూడా జతపరిచారు. అది చదివిన జనం వెంటనే అది నిజం అనుకుని తమ ఎస్బీఐ ఖాతా బ్లాక్ అవకుండా ఉండటం కోసం ఏమీ ఆలోచించకుండా వెంటనే ఆ లింకుపై క్లిక్ చేసి సైబర్ నేరగాళ్లు విసిరిన వలకు చిక్కి భారీ మొత్తంలో మోసపోతున్నారు.



 


ఈ వైరల్ మేసేజ్, ఈమెయిల్ విషయంలో ఫ్యాక్ట్ చెక్ చేసిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో.. అది ఒక ఫేక్ మెసేజ్ అని.. ఫేక్ ఈమెయిల్ స్కామ్ అని స్పష్టంచేసింది. ఇలాంటి వాటి బారిన పడి పొరపాటున కూడా తొందరపాటుతో ఆ లింక్స్ క్లిక్ చేయకూడదని పిఐబి ఫ్యాక్ట్ చెక్ హెచ్చరించింది. ఎస్బీఐ ఎప్పుడూ, ఎవ్వరినీ వారి వ్యక్తిగత వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయదని పిఐబి ఫ్యాక్ట్ చెక్ స్పష్టంచేసింది. గతంలోనూ అనేక సందర్భాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులను ( State Bank Of India ) మోసం చేసేందుకు యత్నించిన సైబర్ నేరగాళ్ల బారి నుంచి పీఐబి ఫ్యాక్ట్ చెక్ ఖాతాదారులను సేవ్ చేసింది.


Also Read : Bank Holidays November 2022: గురు నానక్ జయంతి, కార్తిక పౌర్ణమి.. ఇవాళ బ్యాంకులకు సెలవు దినమా ?


Also Read : 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్, జనవరి నుంచి భారీగా పెరగనున్న జీతభత్యాలు


Also Read : SBI Share Updates: ఆల్ టైమ్ హైకు చేరుకున్న ఎస్బీఐ షేర్, షేర్ ఎంత పెరిగిందంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Faceboo