కమల్ హాసన్ కు సపోర్ట్ గా ప్రకాష్ రాజ్ ట్వీట్
'భారతదేశంలో హిందూ తీవ్రవాదం ఉందని చెప్పలేం' అని నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. హిందూ ఉగ్రవాదం కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. కొన్ని రాష్ట్రాలలో ఈ పరిస్థితి దారుణంగా తయారైయింది' అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలపై బీజీపీ మండిపడింది. కొన్ని చోట్ల దిష్టిబొమ్మలు, నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అయితే కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను సినీ నటుడు ప్రకాష్ రాజ్ సమర్ధిస్తూ.. తనదైన శైలిలో ట్విట్టర్ లో కౌంటర్ విసిరారు. అందులో ఏముందంటే..
‘జాతి, మతం, నైతికత పేరుతో భయపెడితే తీవ్రవాదం కాక మరేంటి? మీరే సెలవివ్వండి’ అని ప్రకాష్ ట్వీట్ చేశారు. దీంతోపాటు ' కేవలం అడుగుతున్నాను.. సమాధానం చెప్పండి' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 'నైతికత పేరుతో దేశంలో యువ జంటలపై దాడులు చేయడం తీవ్రవాదం కాదు. గోవధ చేశారన్నఅనుమానంతో శిక్షించడం తీవ్రవాదం కాదు. భిన్నాభిప్రాయాన్ని చెప్తే వాళ్ళను విమర్శించడం, తిట్టడం తీవ్రవాదం కాదు. మరి తీవ్రవాదం అంటే ఏమిటి?’ అని ప్రకాష్‌రాజ్ ఓ పోస్ట్ చేశారు.