బీజేపీ తీరుపై ప్రకాష్ రాజ్ అసహనం !
జస్ట్ ఆస్కింగ్ అంటూనే తనని విమర్శించిన వారిపై తన అసహనాన్ని వెళ్లగక్కాడు ప్రకాష్ రాజ్.
ఇటీవల కర్ణాటకలోని సిర్సిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఆ కార్యక్రమంలో ఉత్తర కన్నడ ఎంపీ, కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డేని లక్ష్యంగా చేసుకుని పలు విమర్శలు చేశారు. బీజేపీ నేత, కేంద్ర మంత్రిపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు నచ్చని బీజేపీ యువ మోర్చ నేతలు.. ప్రకాష్ రాజ్ పాల్గొన్న వేదికను, అక్కడి స్థలాన్ని గో మూత్రంతో శుద్ధి చేశారు. తమని తాము మేధావులుగా చెప్పుకుంటున్న కొంతమంది వామపక్ష భావజాలం కలిగిన వాళ్లు ఈ వేదికను అపవిత్రం చేశారంటూ ప్రకాష్ రాజ్‌పై, అతడిని ఆ కార్యక్రమానికి ఆహ్వానించిన వారిపై బీజేపీ యువమోర్చ ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రకాశ్ రాజ్ లాంటి వారి రాకతో కేవలం ఈ వేదికే కాదు.. సిర్సి పట్టణం కూడా అపవిత్రమైపోయిందని మండిపడింది బీజేపీ యువమోర్చ.
అయిత్, బీజేపీ యువమోర్చ తీరుపై స్పందించిన ప్రకాశ్ రాజ్.. తాను వెళ్లిన ప్రతీ చోటుని ఇలాగే శుద్ధి చేస్తారా మరి అంటూ తనదైన స్టైల్లోనే విమర్శించాడు. జస్ట్ ఆస్కింగ్ అంటూనే తనని విమర్శించిన వారిపై తన అసహనాన్ని వెళ్లగక్కాడు ప్రకాష్ రాజ్.