Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..
Pune viral video:వర్షం భారీగా కురుస్తోంది. రోడ్డంతా బురద నీళ్లతో నిండిపోయి, నాలాలు నిండుగా పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో యువకుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Pune man surfs on waterlogged roads: సోషల్ మీడియా వచ్చాక కొందరు అతీగా ప్రవర్తిస్తున్నారు. ఒకప్పుడు తమ టాలెంట్ చూపించుకునేందుకు సరైన ప్లాట్ ఫామ్ దొరకలేదని భావించే వారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎవరికి వారు తమ టాలెంట్ ను వీడియోలు, రీల్స్ లు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. దీంతో కొందరు ఓవర్ నైట్ లో స్టార్ లు అయిపోతున్నారు. కానీ కొందరు ఫెమస్ అవ్వాలని అతీగా ప్రవర్తిస్తున్నారు. దీంతో స్టార్ డమ్ రావడం దేవుడేరుగు.. కానీ అందరిలో నవ్వుల పాలౌతున్నారు. ఇటీవల కొందరు యువత మెట్రోలో డ్యాన్స్ లు చేయడం, రొమాన్స్ చేసుకొవడం, రన్నింగ్ బైక్ మీద స్టంట్ లు చేయడం వంటివి చేస్తున్నారు.
వీటికి వ్యూస్, లైక్స్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఇతరులకు ఇబ్బందులు కలిగేలా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తే వావ్ అనిపిస్తే.. ఇంకొన్ని వీడియోలు చూస్తుంటే మాత్రం వామ్మో.. అని ఆశ్చర్యమేస్తుంది. అయితే.. షాకింగ్ కు గురిచేసే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది. అసలే వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లంతా నీళ్లతో నిండిపోయి ఉంటున్నాయి. నాలాలు కూడా పొంగిపొర్లుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువకుడి నిర్వాకం రోడ్డు మీద ఉన్న వారికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
పూర్తి వివరాలు..
ఒక యువకుడు వర్షం నీళ్లలో వైట్ కలర్ చాప వేసుకుని రోడ్డుపై బురద నీళ్లలో సర్ఫింగ్ చేయడం ప్రారంభించాడు. బురద నీటిలో వాహనా దారులకు ఇబ్బందులు కలిగేలా పడుకుని సర్ఫింగ్ చేశాడు. రోడ్డుపైన ఉన్నవారంతా .. ఏంటి వీడికేమన్నా పిచ్చా.. అంటూ అతడిని తిట్టిపోశారు. mipunekar.in అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను పుణె లోని ఎరవాడ ప్రాంతంలో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. వైరల్ గా మారిన ఈ వీడియోలో రోడ్డుపై నీరు బీభత్సంగా ప్రవహిస్తోంది. ఆ నీటిపై ఓ యువకుడు వైట్ కలర్ చాపపై పడుకుని సర్ఫింగ్ చేస్తున్నాడు. రోడ్డుపై ప్రవహించే నీటితో పాటు చాప కూడా స్పీడ్ గా ముందుకు వెళ్తుంది.
Read more: Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..
దానిపై ఆ యువకుడు హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. అంతే కాకుండా... రోడ్డుపై వెళుతున్న వాహనాలకు చేయి ఊపుతూ పక్కకు వెళ్లాలని సైగలు చేస్తున్నాడు. ఈ వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు. అతడు బిజీ రోడ్డుపై అలా సర్ఫింగ్ చేస్తుంటే చుట్టుపక్కల వారు వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం ఇదేం పైత్యం అంటూ కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter