Viral Video: వామ్మో.. డ్రైవర్ లేకుండా 100 కిలో మీటర్ల స్పీడుతో ప్రయాణించిన రైలు.. వైరల్ గా మారిన వీడియో ఇదే..
Punjab: జమ్మూ కాశ్మీర్‌లోని కథువా నుండి గూడ్స్ రైలు డ్రైవర్ లేకుండా 78 కి.మీ. ప్రయాణించింది. అది కూడా 100 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Driverless Train Running At 100kmph In Punjab: సాధారణంగా రైళ్లశాఖ సిగ్నలింగ్ వ్యవస్థలో ఎంతో అలర్ట్ గా ఉంటుంది. కానీ కొన్నిసార్లు మాత్రం అనుకొని ఘటనలు చోటు చేసుకుంటాయి. రైల్వే ప్రమాదాలు ముఖ్యంగా.. పట్టాలు తప్పడం, ఒకే ప్లాట్ ఫామ్ మీద ఎదురుగా మరో రైలు రావడం వంటి ఘటనల వల్ల జరుగుతుంటాయి. కొందరు కావాలని రైళ్లపట్టాలపై బండలు పెడుతూ, రైలు ప్రమాదాలు జరిగేలా చేస్తుంటారు. ఇలాంటివి మనం తరచుగా చూస్తునే ఉంటాం. కానీ రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ ఎంతో అప్ డేటేడ్ గా ఉంటుంది.
రైలు ప్రమాదాలు జరగకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు, రైల్వే ప్రమాదాల ఘటనలు వార్తలలో ఉంటాయి. కొన్నిసార్లు రైళ్లలో సాంకేతిక సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి సమయంలో కూడా ప్రమాదాలు జరిగుతుంటాయి. అచ్చం ఇలాంటి ఒక ప్రమాదకర ఘటన వైరల్ గా మారింది. కానీ లక్కీగా రైలుకు ఎదురుగా మరే ఇతర రైలు కూడా రాలేదు. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పూర్తి వివరాలు...
జమ్మూకశ్మీర్ లోని కథువా నుంచి గూడ్స్ రైలు టెక్నికల్ సమస్యలతో అదే స్టార్ట్ అయ్యింది. అది కూడా వంద కిలో మీటర్ల వేగంతో 78 కి.మీల వరకు ప్రయాణించింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు అలర్ట్ అయ్యారు. పఠాన్‌కోట్ స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు దిగే ముందు డ్రైవర్ హ్యాండ్ బ్రేక్‌ని లాగడం మరచిపోయాడని అధికారులు గుర్తించారు. గూడ్స్ రైలులో మార్బుల్ రాళ్లను ఉంచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గూడ్స్ రైలు.. ఉచి బస్సీ ప్రాంతంలో ఆగకుండానే గంటకు 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తు దాదాపు ఐదు స్టేషన్లను దాటింది.
దీంతో రైల్వే అధికారుల రైలు కన్నా ముందు ఉన్న స్టేషన్ సిబ్బందితో మాట్లాడి.. పొడవైన, బరువైన చెక్కదిమ్మలను ఏర్పాటు చేయించారు. ఈ క్రమంలో గూడ్స్ రైలు.. 78 కిలోమీటర్లు ప్రయాణించి చివరకు పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఆగిపోయింది.
ఈ క్రమంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కల్గకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది. దీనిపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు, చర్యలు చేపట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook