Crows: చికెన్ షాపు మీద యుద్ధం ప్రకటించిన కాకులు.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన వీడియో ఇదే..
Rajahmundry news: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక చికెన్ షాపు ఓనర్ కాకిని కట్టేశాడు. అది బాధతో కదల్లేక కావ్.. కావ్ .. అంటూ తన గ్యాంక్ కు వినపడేలా అరిచింది. దీంతో వందలాదిగా కాకుల గుంపు ఆ ప్రదేశాన్ని రౌండప్ చేశాయి.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
Rajahmundry crows unity to release crow in razole konaseema video goes viral: ప్రస్తుతం సమాజం పూర్తిగా మారిపోయింది. ఎవరికి వారు తమ పనుల్లో బిజీగా ఉంటున్నారు. సాటి వారికి ఏం జరిగిన కూడా పట్టించుకునే పరిస్థితుల్లో ఉండటం లేదు. పక్కవాడికి ఏంజరిగితే నాకేం.. అన్న విధంగా ఉంటున్నారు. కొన్ని సార్లు మనం రోడ్డుపైన వెళ్లుంటాం. ఏదైన ప్రమాదం జరిగిన లేదా అనుకోని ఆపద జరిగితే వెంటనే చాలా మంది తమకేం పట్టనట్లుగా ప్రవర్తిస్తుంటారు. కేవలం కొద్దిమంది మాత్రమే.. సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తు ఉంటున్నారు. సమాజంలో ప్రస్తుతం వింత పోకడలు ఎక్కువయ్యాయి. కనీసం రక్త సంబంధాలకు కూడా విలువివ్వడంలేదు. ఒకప్పుడు ఉన్న విలువలు, పాటిస్తున్న కనీస ధర్మాలు కూడా చాలా మంది తిలోదకాలు వదిలేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మనుషులు ఇలా ప్రవర్తిస్తుంటే.. నోరులేని జీవాలు, పశువులు వీరికి భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. తమ వారికి పోరపాటున ఏదైన ఆపద కలిగితే వెంటనే వందల సంఖ్యలో వచ్చేసి దాడులకు తెగబడుతున్నాయి. మనం కోతులను మన ఇంటి మీదకు రావడం చూస్తుంటాం. అవి ఎంత సేపు వాటి మధ్యలో అవి పొట్లాడుకుంటాయి. పొరపాటున.. బైటి వ్యక్తి, ఇతరులు వాటిని రెచ్చగోట్టేలా ప్రవర్తిస్తే వందలాదిగా వాటి మీద దాడులకు దిగుతాయి. అదే విధంగా అడవిలోని క్రూర జంతువులు, సాధు జంతువులు సైతం యూనిటీగా ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం జరిగిన ఒక ఘటన అందరిని కనువిప్పు కల్గించేదిగా మారింది.
పూర్తి వివరాలు..
అంబేద్కర్ కోనసిమ జిల్లాలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉంన్న తాటిపాకడైలీ మార్కెట్ లో అనేక చికెన్ షాపులు ఉన్నాయి. అక్కడ చికెన్ షాపులో.. కొందరు చికెన్ ముక్కలను షాపు ముందు పడేస్తుంటారు. కాకులు వాటి కోసం అక్కడికి వస్తుంటాయి. ఈ క్రమంలో ఒక చికెన్ షాపు వద్ద ప్రతిరోజు ఒక కాకి చికెన్ ముక్కల కోసం వస్తుంది. అతను ఎంత అదిలించిన అక్కడ నుంచి కదలకుండా అతడిని విసిగిస్తు ఉండేది. దీంతో అతను విసిగిపోయాడు. ఒక రోజు కాకి చికెన్ ముక్కల కోసం వచ్చినప్పుడు.. దాన్ని తాడుతో బంధించాడు.
పాపం.. కాకి కాళ్లు తాడులో ఇరుక్కుని ఎటు కదల్లేక విలవిల్లాడిపోయింది. ఎంత ఎగురుదామని చూసిన కూడా.. కాకి కదల్లేక అక్కడి ఉండిపోయింది. దీంతో వెంటనే.. కావ్.. కావ్.. అంటూ తన గ్యాంగ్ ను అలర్ట్ చేసింది. వెంటనే వందలాదిగా కాకులు ఆ ప్రదేశానికి వచ్చి ఆ ఏరియాను రౌండప్ చేసేశాయి. కాకి ఉన్న మార్కెట్ పరిసర ప్రాంతాల్లో కుక్కలుగా వచ్చేసి కావ్.. కావ్.. అంటూ కూడా అరుస్తు అక్కడి వారికి చుక్కలు చూపించడం స్టార్ట్ చేసేశాయి. కాకులు.. తమ తోటి కాకి కోసం వందలాదిగా మార్కెట్ కు వచ్చినట్లు తెలుస్తోంది. తమ ఫ్రెండ్ ఆపదలో ఉన్న క్రమంలో ఆ కాకులు అక్కడికి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
చివరకు మార్కెట్ లో ఉన్న షాపువాళ్లంతా, కాకుల గోలను భరించలేక కూడా అక్కడికి చేరుకుని, ఆ కాకిని వదలేయమని చికెన్ షాపు ఓనర్ కు చెప్పారు. ఈ క్రమంలో చికెన్ షాపు ఓనర్ కాకిని వదిలిపెట్టగానే.. కాకులన్ని కాసేపటికే అక్కడ నుంచి వెళ్లిపోయాయి. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఒక కాకి ఆపదలో ఉందని, వందలాదిగా ఇతర కాకులు తరలివచ్చాయి. అదే మనుషులు మాత్రం సాటి మనిషి ఆపదలో ఉన్న కూడా.. తమకేం పట్టనట్టుగా ప్రవర్తిస్తాడు. ఇలాంటి సంఘటనలు చూసైన మనిషి మారాలని కూడా మాట్లాడుకుంటున్నారు.ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి