Elephants Attack: టూరిస్ట్ ను తొండంతో ఎత్తిపడేసిన ఏనుగు.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో ఇదే..
Rajasthan: ఏనుగులు అత్యంత శక్తివంతమైన అడవి జంతువులు. వీటిని కొందరు తమ పెంపుడు జంతువుల మాదిరిగా కూడా పెంచుకుంటారు. మనం ఎగ్జిబిషన్ లలో, సర్కస్ లలో ఏనుగులను చూస్తుంటాం. కానీ కొన్నిసార్లు ఇవి కోపంతో దాడులకు పాల్పడిన ఘటనలు కూడా తరచుగా చోటుచేసుకుంటాయి.
Elephant Attack On Russia Tourist At Jaipur: ఏనుగులను ఎక్కువగా బలంగా ఉండే జీవులలో ఒకటిగా పరిగణిస్తారు. ఇవి అడవిలో గుంపులుగా సంచరిస్తు, బలమైన, పెద్ద పెద్ద చెట్లను తమ తొండంతో అమాంతం నెల మట్టం చేస్తుంటాయి. ఒక ఏనుగును సింహాలు కానీ, పులులు కానీ వేటాడాలంటే.. కనీసం 20 వరకు ఒక్కసారిగా దానిపైన దాడిచేయాలి. అప్పటికి కొన్నిసార్లు.. ఏనుగులు తమ తుండం, పాదాలతో తమముందు వచ్చిన జంతువులను ఎత్తిపడేస్తుంటాయి.
అడవికి దగ్గరగా ఉండే ప్రాంతాలలో తరచుగా ఏనుగుల గుంపు దాడిచేస్తుంది. పంటపొలాలను కూడా పూర్తిగా ధ్వంసం చేస్తుంటాయి. ఇలాంటివి మనం తరచుగా చూస్తుంటాం. అడవి అధికారులు.. మావటి వాళ్లతో కొన్ని ఏనుగును చిన్నప్పటి నుంచి పెంచుకుని ఏనుగులను మచ్చిక చేసుకుంటారు.
కొన్నిసార్లు ఊర్లలో, దేవాలయాల ప్రాంగణంలో ఏనుగులు ఉండటం మనం చూస్తుంటాం. భక్తులు వాటికి అరటి పండ్లు, కొబ్బరి కాయలను ఇస్తుంటారు. అవి తుండంతో బ్లెస్సింగ్స్ ఇస్తుంటాయి. కానీ కొన్నిసార్లు ఏనుగులు కోపంలో ఉంటాయి. అలాంటి సమయంలో వాటి దగ్గరకు వెళ్లిన వారిపై క్రూరంగా దాడికి దిగుతుంటాయి. ఇలాంటి ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది.
పూర్తి వివరాలు..
సాధారణంగా పర్యాటక ప్రదేశాలకు చూడటానికి విదేశాల నుంచి టూరిస్టులు వస్తుంటారు. అచ్చం ఇలాగే.. రష్యా నుంచి ఒక టూరిస్టు రాజస్థాన్ లోని జైపూర్‌కు వచ్చాడు. అక్కడి ప్రదేశాలను ఎంతో ఆసక్తిగా పర్యటించడానికి వచ్చాడు. ఈ క్రమంలో అతగాడు.. ప్రసిద్ధ అమెర్ ఫోర్ట్ వద్ద ఏనుగులు ఉండటం చూశాడు. ముచ్చటపడి ఏనుగు దగ్గరకు వెళ్లాడు. సాధారణంగా మావటివాళ్లు ఏనుగు మీద కూర్చొని ఉంటారు. కానీ ఇక్కడ ఒక షాకింగ్ ఘటన జరిగింది. మరీ.. ఏనుగు ఆ టూరిస్టును చూసి ఏమనుకుందో ఏమో..కానీ ఒక్కసారిగా తన తొండంతో అతనిపై దాడికి పాల్పడింది.
అంతటితో ఆగకుండా.. అతన్ని పట్టుకుని నెలకేసి బలంగా పడేసింది. దీంతో చుట్టుపక్కల ఉన్నవారు భయంతో పరుగులు పెట్టారు. అప్పటి దాక.. కేరింతలు కొడుతు, అక్కడి ప్రాంతాన్ని ఎంజాయ్ చేస్తున్న వారంతా.. భయంతో అక్కటి నుంచి దూరంగా పారిపోయారు. మావటి వాడు ఏనుగును మరల దూరంగా తీసుకెళ్లాడు. స్థానికులు వెంటనే టూరిస్టును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
Read More: Snake Bite: పాములు కుట్టబోయే ముందు ఈ సిగ్నల్స్ ఇస్తాయంట.. అలర్ట్ అయితే రిస్క్ నుంచి బైటపడ్డట్లే..
ఏనుగు అలా కోపంగా ఎందుకు ప్రవర్తించిందో తెలియరాలేదు. ఈ ఘటన తర్వాత.. ఆ ప్రాంతంలో.. ఏనుగుల మీద స్వారీ చేయడం నిషేధించారు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ స్పందించారు.
వెంటనే.. ఆయన ఉప ముఖ్యమంత్రి దియా కుమారి, రాష్ట్ర అటవీ శాఖతో అధికారులతో మాట్లాడారు. గౌరీ ఏనుగును వన్యప్రాణుల అభయారణ్యంలోకి మార్చాలని గట్టిగా విజ్ఞప్తి చేశారు. కాగా , గతంలోను గౌరీ అనే ఏనుగు ఇలానే దాడిచేసిన ఘటనలు జరిగాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook