`రానా` చొక్కా వెనుక రహస్యమిదే..!
ఈ ట్వీట్ ఎప్పుడు రానా కంట్లో పడిందో కానీ.. ఆయన కూడా సరదాగా వైరల్ అవుతున్న ఆ ట్వీట్‌కి జవాబిచ్చారు.
ఈ మధ్యకాలంలో ఎవరో ఒక ఫోటోని ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ.. ఫలూడా సెంటర్‌లో పనిచేసే వెయిటర్స్ బట్టలు అచ్చం "నేనే రాజు నేనే మంత్రి" సినిమాలో హీరో రానా వేసుకున్న బట్టల్లా ఉన్నాయని కామెంట్ చేశారు. ఈ సినిమాలో రానా చొక్కా పై భాగంలో చిన్న చిన్న జేబులు ఉంటాయి. అయితే ఫలూడా సెంటర్‌లో వెయిటర్లు ఆ జేబుల్లోనే స్ట్రాస్ పెట్టుకోవడం.. ఆ జేబుల్లోంచే స్ట్రాస్ తీసి కస్టమర్లకు సప్లై చేయడంతో.. బహుశా వారికి రానా సినిమా ఆదర్శం కావచ్చు అని కూడా కొందరు ట్వీట్ చేశారు. "మీకు తెలీదేమో.. ఆ వెయిటర్లకి నా సినిమా ఆదర్శం కాదు. వాళ్లనే ఆదర్శంగా తీసుకొని ఆ డ్రస్ వేసుకొని నేను ఆ సినిమాలో నటించాను" అని ట్వీట్ చేశారు రానా.