Rapido Driver Viral Video: యువతిని అక్కడ ఇక్కడ తడుముతూ ర్యాపిడో డ్రైవర్ వేధింపులు... స్పీడ్‌గా ఉన్న బైక్‌పై నుంచే దూకిన బాధితురాలు
Rapido Driver Gropes Woman on Bike: తన ఫోన్ తీసుకుని తనని అక్కడ, ఇక్కడ తడుముతూ వేధించడమే కాకుండా తీసుకెళ్లాల్సిన రూట్లో కాకుండా మరో రూట్లో తీసుకెళ్తుండటంతో ఆ యువతి అతడిపైకి తిరగబడింది. ఇదేంటని ప్రశ్నించింది. దీంతో అతడు బైక్ వేగం మరింత పెంచాడు.
Rapido Driver Gropes Woman on Bike: రాత్రి 11 గంటల సమయంలో తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లేందుకని ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్న ఓ యువతిపై ఆ ర్యాపిడో బైక్ రైడర్ లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడు. ఓటిపి చెక్ చేసి ఇస్తానని చెప్పి ఫోన్ తీసుకుని ఆమెని బైక్ ఎక్కించుకున్న సదరు ర్యాపిడో బైక్ డ్రైవర్.. ఆమెకి ఫోన్ తిరిగి ఇవ్వకుండా దారిలో అక్కడ ఇక్కడ తడుముతూ వేధింపులకు గురిచేశాడు. ఆమెను తీసుకెళ్లాల్సిన రహదారిలో కాకుండా మరో మార్గంవైపు బైకుని తీసుకెళ్లాడు.
తన ఫోన్ తీసుకుని తనని అక్కడ, ఇక్కడ తడుముతూ వేధించడమే కాకుండా తీసుకెళ్లాల్సిన రూట్లో కాకుండా మరో రూట్లో తీసుకెళ్తుండటంతో ఆ యువతి అతడిపైకి తిరగబడింది. ఇదేంటని ప్రశ్నించింది. దీంతో అతడు బైక్ వేగం మరింత పెంచాడు. ర్యాపిడో బైక్ డ్రైవర్ ప్రవర్తనతో తనకి ఏదో ఆపద పొంచి ఉందని ముందే పసిగట్టిన ఆ యువతి.. బైక్ స్పీడ్‌గా వెళ్తున్న సమయంలోనే ధైర్యం చేసి బైక్ పై నుంచి దూకేసింది. బెంగళూరులోని యలహంక పోలీసు స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 21న చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇందిరానగర్లో ఉన్న తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లేందుకు యువతి ర్యాపిడో బుక్ చేసుకోగా.. అతడు ఆమెపై వేధింపులకు పాల్పడుతూనే దొడ్డబళ్లాపూర్ మార్గంలో తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. ప్రమాదం పసిగట్టిన బాధితురాలు ఓ కాలేజీ సమీపంలో వేగంగా వెళ్తున్న బైక్ పై నుంచి దూకేసింది. యువతి బైక్ పై నుంచి దూకడం చూసిన ఆ కాలేజీ సెక్యురిటీ సిబ్బంది ఆమె వద్దకు పరుగెత్తుకొచ్చి ఆమెకు సహాయం చేశారు. ఆ సమయంలో హెల్మెట్ ధరించి ఉండడంతో అదృష్టవశాత్తుగా తలకు గాయాలుకాలేదు కానీ ఆమె చేతులకు, కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి.
కాలేజీ సెక్యురిటీ సిబ్బంది ఫోన్ తీసుకుని తన కుటుంబసభ్యులకు సమాచారం అందించిన యువతి.. ఆ తరువాత ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు చెప్పిన వివరాలు, ర్యాపిడో డ్రైవర్ నెంబర్ ఆధారంగా అతడి ఆచూకీ గుర్తించిన పోలీసులు.. వెంటనే అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని ఏపీకి చెందిన దీపక్ రావుగా గుర్తించారు. 27 ఏళ్ల దీపక్ బెంగళూరులో ర్యాపిడో డ్రైవర్ గా పనిచేసుకుంటున్నాడు. ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు వివరాలు వెల్లడిస్తూ.. నేరానికి పాల్పడిన సమయంలో నిందితుడు దీపక్ రావు తాగిన మైకంలో ఉన్నాడని తెలిపారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. యువతి ధైర్యానికి నెటిజెన్స్ మెచ్చుకుంటున్నారు. ఆ సమయంలో యువతి ధైర్యం చేసి అలా దూకకపోయి ఉంటే.. నిందితుడి చేతిలో ఆమెకు ఇంకెంత పెద్ద ఆపద ఎదురై ఉండేదోనని నెటిజెన్స్ అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి తెగింపు మహిళల్లో, ఆడపిల్లల్లో ఉండాల్సిందేనని కితాబిస్తున్నారు. కీచకలు చేతిలో వేధింపులకు గురయ్యే సమయంలో మహిళలు తెగించి పోరాడితే గెలుపువారిదేనని ఈ ఘటన నిరూపించింది అని నెటిజెన్స్ కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.