Rash driving in Hyderabad video viral: కొంత మంది రోడ్ల మీద ఇష్టమున్నట్లు డ్రైవింగ్ చేస్తున్నారు. కారు నడపరాకున్న రోడ్ల మీదకు వచ్చేస్తుంటారు. దీంతో వారి ప్రాణాలను రిస్క్ లో వేసుకొవడం కాకుండా.. అమాయకుల ప్రాణాలు సైతం తీస్తుంటారు. ఇటీవల కాలంలో చాలా మంది తమకు వాహానాలు సరిగా నడిపియ్యడం రాకున్న రోడ్ల మీదకు వస్తున్నారు. మరికొందరు తప్పతాగి కార్లు నడిపిస్తున్నారు. ఇంకొందరు  రాంగ్ రూట్ లోకి వచ్చేయడం ఇష్టమున్నట్లు డ్రైవింగ్ చేయడంవంటివి చేస్తుంటారు. దీని వల్ల.. వారి ప్రాణాలు మాత్రమే కాకుండా.. అమాయకులు కూడా బలౌతున్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ఇప్పటికే రోడ్డు ప్రమాదాలలో తాగి నడిపే వారి వల్ల, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారి వల్ల ఎక్కువగాజరుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు.. నిబంధనలను పాటించాలని ఎంత చెప్పిన కూడా కొంత మంది అస్సలు పట్టించుకోవడంలేదు. దీని వల్ల అమాయకులు బలౌతున్నారు. అంతేకాకుండా.. రద్దీగా ఉండే ప్రదేశాలు, స్కూళ్ల దగ్గర తమ వాహానాలను ఇష్టమున్నట్లు నడిపిస్తు ప్రమాదాలకు కారణమౌతున్నారు. ఈ కోవకు చెందిన ఒక షాకింగ్ ఘటన ప్రస్తుతంవైరల్గా మారింది.



పూర్తి వివరాలు..


హైదరాబాద్ లోని వనస్థలిపురంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా.. ఎన్జీవో కాలనీలో జరిగిన ప్రమాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక యువతి తన మార్గంలో తాను వెళ్తుంది. ఇంతలో ఒక కారు వెనక నుంచి వేగంగా వచ్చి, ఆమెను బలంగా ఢీకొట్టింది. కారు స్పీడ్ కు ఆమె గాల్లో బంతిలాగా ఎగిరి దూరంగా పడిపోయింది. దాదాపు.. ఆమె 10 మీటర్ల దూరంలో ఎగిరి పడినట్లు తెలుస్తోంది. వెంటనే స్థానికలు యువతిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. యువతికి బలమైన గాయాలు అయినట్లు కూడా తెలుస్తోంది.


Read more: CM Revanth Reddy: దంచికొడుతున్న వానలు.. అధికారులు సెలవులు పెట్టొద్దు.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్..


 


కారు ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. కారుప్రమాదానికి చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు షాక్ కు గురౌతున్నారు. రద్దీగా ఉండే ప్రదేశాలు, స్కూళ్ల వద్ద జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు. కారు నడిపియ్యడం రాకుండా..బైటకు తీసి ఇతరుల ప్రాణాలు పోయేలా డ్రైవ్ చేయడం ఏంటని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.