Ravan Riding Bike: బైక్ నడుపుతున్న రావణుడి వీడియో వైరల్.. ఇంతకీ అసలు మేటర్ ఏంటో తెలుసా ?
Ravan Riding Bike, Viral Video: పౌరాణికం సినిమాల్లోనో లేక నాటికల్లోనో చూసే 10 తలల రావణుడి పాత్ర రోడ్డెక్కి బైక్ నడుపుతుంటే చూడ్డానికి ఆ దృశ్యం ఎలా ఉంటుందో ఊహించుకోండి !! మీరు ట్రాఫిక్‌లో బైక్ నడుపుతూ వెళ్తుంటే.. మీ పక్కనే రావణుడు బైక్‌పై వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి !!
Ravan Riding Bike, Viral Video: రావణుడు బైక్ నడుపుతూ రోడ్డెక్కడం ఏంటనుకుంటున్నారా ? ఆ.. అలా ఎందుకు జరుగుతుందిలే అని అనుకుంటున్నారా ? కానీ ఇదిగో ఈ వీడియోలో అలాగే జరిగింది. అవును.. అచ్చం అలాగే జరిగింది. రావణుడు బైక్ నడుపుతూ రోడ్డెక్కడం చూసి ఆశ్చర్యపోవడం వీక్షకుల వంతయ్యింది. అయితే దానికి ఒక మంచి పర్పస్, ఒక ప్రజా ప్రయోజనం ఉందండోయ్. అదేంటో తెలియాలంటే ముందుగా మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
చూడ్డానికి ఫుల్ హిలేరియస్‌గా ఉన్న ఈ వీడియో చూస్తే దాని వెనుకున్న సందేశం ఏంటో కూడా ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. అవును.. రోడ్ సేఫ్టీ గురించి వాహనదారులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ముంబై పోలీసులు సృజనాత్మకత జోడించి చేయించిన వీడియో ఇది. నాకంటే పది తలలు ఉన్నాయి కానీ నీకు ఉన్నది ఒక్కటే తల కాబట్టి హెల్మెట్ పెట్టుకొమ్మని సున్నితంగానే మందలించిన రావణుడి వీడియో నెటిజెన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు.. ఆలోచింపచేస్తోంది కూడా. జనం శ్రేయస్సు కోరి ముంబై పోలీసులు చెప్పింది కూడా నిజమే కదా.
మెడకాయపై తలకాయ ఉన్నోళ్లు ఎవరైనా హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తారా చెప్పండి. నిండు జీవితానికి ఉన్న ఒక్కను తలకాయను కాపాడుకోకుండా.. హెల్మెట్‌ని బైక్ పెట్రోల్ ట్యాంక్ మీదనో లేక వెనకాలో తగిలిస్తే ఏం లాభం చెప్పండి !! ప్రమాదాలు ఎప్పుడూ చెప్పి రావు.. అవి ఎప్పుడూ అనుకోకుండానే జరిగిపోతుంటాయి. అలా ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలతో బయటపడే అవకాశాలు అధికంగా ఉంటాయి. అలా కాదని ఎవరో చెబితే మేమెందుకు వింటాం అని అనుకుంటే.. ఇంట్లో మిమ్మల్నే నమ్ముకున్న ఫ్యామిలీ ఒకటుందనే విషయమైనా గుర్తుంచుకోండి మరి!!
Also Read : Selfie With Tiger: అడవిలో పులిని పరిగెత్తించిన యువకులు.. సెల్ఫీకి యత్నం, వీడియో వైరల్
Also Read : 5G Network Activation: మీ స్మార్ట్‌ఫోన్‌లో 5G నెట్‌వర్క్ యాక్టివేట్ చేసుకోండిలా
Also Read : Python Snake in Graveyard: ఒక సమాధిలోంచి మరో సమాధిలోకి 6 అడుగుల కొండచిలువ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి