Red Wine Flowing In Streets: కంపెనీలో స్టోరేజ్ ట్యాంకులు పగిలి రోడ్లపై పొంగిపొర్లిన రెడ్ వైన్.. వీడియో వైరల్
Red Wine Flowing Through Streets: వైన్ షాపులో లేదా లిక్కర్ మార్ట్‌లో అత్యంత ఖరీదైన లేబుల్స్‌తో ఉన్న బాటిళ్లలో కనిపించే రెడ్ వైన్ వీధుల్లో నదీ జలాల తరహాలో.. రెడ్ వైన్ నింపిన డ్యామ్‌కి గేట్లు ఎత్తినట్టుగా ఉప్పొంగి ప్రవహించే తీరు చూస్తే.. చూడ్డానికి ఆ దృశ్యం ఎలా ఉంటుందో, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.
Red Wine Flowing Through Streets: వైన్ షాపులో లేదా లిక్కర్ మార్ట్‌లో అత్యంత ఖరీదైన లేబుల్స్‌తో ఉన్న బాటిళ్లలో ఉన్న ఖరీదైన రెడ్ వైన్‌ని చూసే ఉంటారు. ఎంతో ఖరీదు పెడితే కానీ లేదంటే ఫుల్ బాటిల్ కానీ లేదా హాఫ్ బాటిల్ కూడా కానీ రాదు. అలాంటి రెడ్ వైన్ వీధుల్లో నదీ జలాల తరహాలో.. రెడ్ వైన్ నింపిన డ్యామ్‌కి గేట్లు ఎత్తినట్టుగా ఉప్పొంగి ప్రవహించే తీరు చూస్తోంటే చూడ్డానికి ఆ దృశ్యం ఎలా ఉంటుందో, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అబ్బే ఊరుకోండి.. అలా ఎందుకు జరుగుతుంది ? అంత ఖరీదైన రెడ్ వైన్‌ని వీధుల్లో ఎవరైనా ఎందుకు ఉప్పొంగి ప్రవహించేలా పారిస్తారు అనే కదా మీకు వచ్చే మొదటి సందేహం. అయితే, మీరు ఈ వీడియో చూస్తే మీకున్న అలాంటి సందేహాలన్నీ పటాపంచలైపోతాయి.
పోర్చుగల్‌లోని సావో లోరెంకో డి బైరో పట్టణం ఆదివారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ఎత్తుగా ఉన్న కొండ ప్రాంతంపై నుంచి లక్షల లీటర్ల రెడ్ వైన్ ప్రవాహంలా కిందున్న వీధుల్లోకి ప్రవహించడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నాం అన్నట్టుగా ఆ రెడ్ వైన్ వైపు తేరిపార చూడాసాగారు. ఇళ్ల మధ్య నుంచి నదిలా ప్రవహిస్తున్న రెడ్ వైన్ ని చూసి అశ్చర్యపోని వాళ్లు లేరు.
పోర్చుగల్ మీడియా కథనాల ప్రకారం, సుమారు 2.2 మిలియన్ లీటర్లు రెడ్ వైన్ వీధులపాలైంది. అంటే 600,000 గ్యాలన్ల రెడ్ వైన్ మాట రోడ్లపై వరదలా వెల్లువెత్తిందన్నమాట. రోడ్లపై పొంగిపొర్లిన రెడ్ వైన్‌తో 2,933,333 వైన్ బాటిళ్లను నింపవచ్చని అంచనాలు చెబుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇలా కిందపోయిన రెడ్ వైన్‌తో ఏకంగా ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్ పోటీల కోసం నిర్మించే ఒక స్విమ్మింగ్ పూల్‌నే నింపేయొచ్చు అని న్యూయార్క్ పోస్ట్ కథనం పేర్కొంది.
ఇది కూడా చదవండి : Jawan Movie Poster: హెల్మెట్ ధరించకపోతే ఇలానే ఉంటుందంటున్న పోలీసులు
2 వైన్ స్టోరేజీ యూనిట్లు పగిలిపోవడం వల్ల ఇలా రెడ్ వైన్ ఏరులై పారిందని ప్రకటించిన లెవిరా డిస్టిలరీస్ కంపెనీ.. పట్టణ వాసులకు జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూ ఫేస్‌బుక్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. "ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు అవనప్పటికీ.. ఇక్కడి ప్రజలకు జరిగిన అసౌకర్యానికి, కొద్దిపాటి సాధారణ నష్టానికి తాము చింతిస్తున్నాం అని లెవిరా డిస్టిలరీస్ కంపెనీ తమ ఫేస్ బుక్ పోస్టులో పేర్కొంది. సమీపంలోని సెర్టిమా నది జలాలు ఈ రెడ్ వైన్ కారణంగా కలుషితం కాకుండా ఉండేందుకు నష్ట నివారణ చర్యలు చేపట్టింది. రెడ్ వైన్ ప్రవాహాన్ని నది వైపు వెళ్లకుండా మళ్లించే పనుల్లో అక్కడి అగ్నిమాపక శాఖ బిజీ అయింది. ప్రస్తుతం ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాలో నెటిజెన్స్‌ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది.
ఇది కూడా చదవండి : Funny Stunt Video: హీరో లెవల్ ఎంట్రీ.. లవర్‌కి ముద్దు పెట్టబోయి, ఢమాల్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి