Rhinos Vs Lions, Tigers vs Elephants: అడవికి సింహం రాజు.. అడవికి పులి రాజు అంటూ రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి కదా.. కానీ అడవికి నిజమైన రాజు ఎవరో మీరేమైనా చెప్పగలరా ? అడవికి అసలైన రాజు ఎవరు అని అడిగితే, ఇప్పటివరకు మీ వద్ద సమాధానం రెడీగా ఉండి ఉంటుంది. కానీ ఇదిగో ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రెండు వీడియోలు చూస్తే ఇక మీరు కూడా అయోమయంలో పడిపోతారు. అడవికి రాజు ఎవరని అడిగితే సమాధానం చెప్పడానికి ఆలోచించే పరిస్థితి వస్తుంది. ఇంతకీ ఆ రెండు వీడియోలు ఏంటి ? అందులో ఏముంది అనే కదా మీ సందేహం. అయితే ఇదిగో ఈ వీడియో చూడండి.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


చూశారు కదా.. అడవిలో బండ్ల బాట లాంటి దారిలో రెండు సింహాలు కూర్చుని ఉన్నాయి. అదే సమయంలో వెనుక నుండి రెండు ఖడ్గ మృగాలు వచ్చాయి. ముందుగా ఆ ఖడ్గ మృగాలను గమనించనంత వరకు అక్కడే ఠీవీగా కూర్చున్న సింహాలు.. ఎప్పుడైతే వాటిని చూశాయో అప్పుడే వెంటనే అక్కడి నుంచి లేచి చెట్ల పొదల్లోకి వెళ్లిపోయాయి. చూడ్డానికి ఈ సీన్ ఎలా ఉందంటే.. ఈ రెండు సింహాలు ఆ రెండు ఖడ్గ మృగాలకు దారి ఇచ్చి పక్కకు తప్పుకున్నట్టుగా ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సీన్ చూసిన నెటిజెన్స్ కూడా ఇదే రకమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది అయోమయంలో పడ్డారు. అడవికి సింహం రాజు కదా.. మరి ఖడ్గమృగాలను చూసి అవి ఎందుకు సైడ్ ఇస్తున్నాయి అని డైలమాలో పడ్డారు.


ఇలాంటి సీనే మరొకటి కూడా ఉంది. అచ్చం ఇలాగే అడవిలో దారిలో కూర్చున్న ఓ పులి కూర్చుని ఉంది. ఏదైనా జంతువు అటుగా వస్తే దానిని వేటాడి తిందామని పులి దారి కాచుకుని కూర్చున్నట్టుగా అనిపించింది. కానీ ఎప్పుడైతే ఆ పులి తన వెనుక వైపు నుండి వస్తోన్న ఏనుగును చూసిందో.. అప్పుడే లేచి ఇంతకు ముందు సీన్లో సింహాల తరహాలోనే ఏనుగుకు సైడ్ ఇస్తూ చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. 



ఇది కూడా చూడండి : Salma Hayek Photos Gallery: లేటు వయసులో ఘాటు అందాలతో పిచ్చెక్కిస్తోన్న ఈ సుందరి కథ ఏంటో తెలుసా ?


ఈ దృశ్యం చూసిన నెటిజెన్స్ కి అప్పటివరకు పులిపై ఉన్న అభిప్రాయం పోవడమే కాకుండా.. ఇప్పుడు పులి పెద్దనా లేక ఏనుగు పెద్దనా అనే సందేహం మొదలైంది. ఇంతకు ముందు చూసిన దృశ్యంలో సింహాలు పెద్దనా లేక ఖడ్గమృగాలు పెద్దనా అనే సందేహం వచ్చినట్టుగానే అన్నమాట. ఇదే విషయమై ప్రముఖ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద స్పందిస్తూ.. అడవికి సింహాం రాజానా లేక పులి రాజానా అని కాదు.. సమయం, సందర్భాన్ని బట్టి పరిస్థితులు మారుతుంటాయి అని తన వీడియోకు క్యాప్షన్ పెట్టారు. అది 100 శాతం నిజం కదా.


ఇది కూడా చూడండి : Funny Engineering Mistakes Photos: కడుపుబ్బా నవ్వించే ఇంజనీరింగ్ తప్పిదాలు.. ఎవడ్రా బాబూ ఇవి నిర్మించింది అనిపించే వైరల్ ఫోటోలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి