Russian influencer viral video: సాధారణంగా విదేశాల నుంచి మన దేశానికి  చాలా మంది ఫారెనర్స్ వస్తుంటారు. మన దేశంలోని సంప్రదాయాలు, అలవాట్లు మొదలైన వాటిని వాళ్లు ఇష్టపడుతుంటారు. ఇక్కడ లభించే మంచి వెరైటీ ఫుడ్ లను తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అంతేకాకుండా.. కొత్త కొత్త ప్రదేశాలకు కూడా వెళ్తుంటారు. ఈ క్రమంలో.. కొంత మంది ఇక్కడి ట్రెడిషన్ నచ్చి ఇక్కడే ఉండిపోయిన వాళ్లు కూడా ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇక్కడ చీరకట్టు, బొట్టు పెట్టుకునే విధనంను, వేడుకలు, ఉత్సవాలను విదేశీయులు పాటిస్తుంటారు. కానీ మనవాళ్లు మాత్రం దీనికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. మన ఆచారాలు, పద్ధతుల పట్ల చిన్న చూపు చూస్తున్నారు. ఈ క్రమంలో రష్యా నుంచి మనదేశానికి వచ్చిన ఒక యువతి ఇటీవల ముంబైలో హల్ చల్ చేసింంది. ఆమె చేసిన ఒక పని ప్రస్తుతం  సోషల్ మీడియాలో వైరల్గా మారింది.


పూర్తి వివరాలు..


రష్యాకు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ మారియా చుగురోవా  ఇటీవల ముంబైకి వచ్చింది. ఆమె  అక్కడి వీధుల్లో తిరుగుతూ మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది. కొత్త ప్రదేశాలు ఎక్కడ ఉంటాయని కూడా అక్కడి లోకల్ వాళ్లతో ఆరా తీస్తుంది. ఈ క్రమంలో ఆమెకు రోడ్డుపక్కన ఒక మహిళ ఇడ్లీలు, బజ్జీలు, సాంబార్ అమ్ముతుంది. ఆమె దగ్గరకు ఇన్‌ఫ్లుయెన్సర్ మారియా చుగురోవా వెళ్లింది. ఏంటీ స్పెషల్ అని అడిగి, ఇడ్లీ తీసుకుంది.


అంతేకాకుండా.. ఇడ్లీ సాంబార్ ను ఆమె తొలిసారితింటున్నట్లు తెలుస్తోంది. ఆమె నోట్లో వేసుకోగానే.. ఒక్కసారిగా వావ్.. అంటూ ఉప్పొంగిపోయింది. ఇడ్లీలు అమ్మిన మహిళ..సుధాను పొగడ్తలతో ముంచెత్తింది. అంతేకాకుండా.. తను తొలిసారి ఇడ్లీ సాంబార్ తిన్నానని,  ఇంత టెస్టీ ఎక్కడ చూడలేదని కూడా చెప్పింది.


Read more: Viral video: అయ్యయ్యో.. ఈ కష్టం ఎవరికి వద్దూ భయ్యా.. వేదిక మీద ఇదేం అరాచకం.. వైరల్‌గా మారిన వీడియో..


ఆమె తన ఇన్ స్టాలో సుధాతో వీడియో తీసుకుని దాన్ని పోస్ట్ చేసింది . ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో ఇన్‌ఫ్లుయెన్సర్ మారియా చుగురోవా  ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కు నెటిజన్ లు ఫిదా అవుతున్నారు.