YouTuber Demolishes Lamborghini Urus: యూట్యూబ్ వీడియో కోసం రూ 3 కోట్లకుపైగా విలువైన కారును ధ్వంసం చేశాడు
YouTuber Demolishes Lamborghini Urus: అసలే అతడు ఫేమస్ యూట్యూబర్. యూట్యూబ్‌లో ఏం చేస్తే.. ఎలా చేస్తే ఫలితం ఉంటుందో తెలిసిన వాడు. అందుకే తన క్రియేటివిటీకి పదును పెట్టి అంతిమంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంత ఖరీదైన కారును లెక్కచేయకుండా ధ్వంసం చేస్తే.. అందుకు కారణం ఏంటనే ఆలోచన ప్రతీ ఒక్కరినీ ఆలోచనలో పడేస్తుంది.
YouTuber Demolishes Lamborghini Urus: రష్యాకు చెందిన ఫేమస్ యూట్యూబర్ మైఖెల్ లిట్విన్ తన యూట్యూబ్ వీడియో కోసం సుమారు రూ. 3 కోట్లకుపైగా విలువైన లాంబర్గిని ఉరస్ ఎస్‌యూవి కారును ధ్వంసం చేశాడు. కేవలం యూట్యూబ్ వీడియో కోసం మాత్రమే కాదు.. తన పేరిట కొత్తగా లాంచ్ అయిన ఎనర్జి డ్రింక్ బ్రాండ్ లిట్ ఎనర్జిని ప్రమోట్ చేసుకునేందుకు మైఖెల్ లిట్విన్ చేసిన ఈ ప్రయత్నం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలే అతడు ఫేమస్ యూట్యూబర్. యూట్యూబ్‌లో ఏం చేస్తే.. ఎలా చేస్తే ఫలితం ఉంటుందో తెలిసిన వాడు. అందుకే తన క్రియేటివిటీకి పదును పెట్టి అంతిమంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంత ఖరీదైన కారును లెక్కచేయకుండా ధ్వంసం చేస్తే.. అందుకు కారణం ఏంటనే ఆలోచన ప్రతీ ఒక్కరినీ ఆలోచనలో పడేస్తుంది. ఆ కారణం ఏంటో తెలుసుకునేలా చేస్తుంది. అందుకోసం తన యూట్యూబ్ వీడియో చూస్తారు. అలా చూశారంటే తన వీడియోకు వ్యూస్ లభించడం మాత్రమే కాదు.. తన ఎనర్జి డ్రింక్ బ్రాండ్ లిట్ ఎనర్జి కూడా ప్రమోట్ అవుతుంది అనేది మైఖెల్ లిట్విన్ ఐడియా.
మైఖేల్ లిట్విన్ స్కెచ్ వేసినట్టుగానే యూట్యూబ్ వీడియో వైరల్ అయింది. అంత ఖరీదైన కారును ధ్వంసం చేయడానికి కారణం ఏంటనే థాట్ కూడా వారిని అటువైపు లాక్కొచ్చింది. తన ఎనర్జి డ్రింక్ ని పోలిన భారీ సైజ్ క్యాన్ ని క్రేన్ సహాయంతో పైకి ఎత్తి ఆ భారీ సైజున్న క్యాన్ ని కారుపై అమాంతం డ్రాప్ చేయించాడు. ఆ క్యాన్ బరువుకు లాంబర్గిని కారు ధ్వంసం అవడం వీడియోలో చూడొచ్చు.
మైఖేల్ లిట్విన్ స్కెచ్ వేసినట్టుగానే యూట్యూబ్ వీడియో వైరల్ అయింది. అంత ఖరీదైన కారును ధ్వంసం చేయడానికి కారణం ఏంటనే థాట్ కూడా వారిని అటువైపు లాక్కొచ్చింది. కానీ మైఖెల్ లిట్విన్ చేసిన ఈ పనికి నెటిజెన్స్ నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. నీ బ్రాండ్‌ని ప్రమోట్ చేసుకోవడానికి అంత ఖరీదైన కారును నాశనం చేయాలా ? ఇంకా వేరే ఐడియా ఏదీ దొరకలేదా అని మండిపడుతున్నారు. తక్కువ బడ్జెట్‌లోనూ క్రియేటివ్ యాడ్స్ ప్లాన్ చేయొచ్చు కదా అని అభ్యంతరం వ్యక్తంచేసే వాళ్లు కూడా ఉన్నారు.