Sea Lion Video Game: వీడియో గేమ్ ఆడిన సముద్ర సింహం.. నమ్మకుంటే ఈ వీడియో చూడండి!
Sea lion played video game as part of US Navy research project. స్పైక్ పేరు గల సముద్ర సింహం వీడియో గేమ్ శిక్షణ పూర్తి చేసింది. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
Sea Lion Spike Played Video Game very Well: 'స్మార్ట్‌ఫోన్' వచ్చినప్పటి నుంచి ప్రపంచం అంతా అరచేతుల్లోనే కనిపిస్తోంది. అందుకే ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌కు బానిస అవ్వని వారు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చిన్నా, పెద్దా తేడా లేకుండా చేతిలో స్మార్ట్‌ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండడలేకపోతున్నారు. అంతెందుకు 6 నెలల చిన్నారి కూడా స్మార్ట్‌ఫోన్‌ను చూపిస్తే.. ఏడవకుండా అలానే చూస్తుంటుంది. కేవలం మనుషులే కాదు జంతువులు కూడా స్మార్ట్‌ఫోన్‌కు బానిస అవుతున్నాయి. ఏకంగా వీడియో గేమ్ కూడా ఆడుతున్నాయి. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
యూఎస్ నేవీ శాస్త్రవేత్తలు సముద్రపు క్షీరదాల కోసం అభిజ్ఞావృద్ధికి సంబంధించిన పరిశోధన ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వీడియో గేమ్‌లు ఆడేందుకు సముద్ర సింహాల సమూహానికి శిక్షణ ఇస్తున్నారు. స్పైక్ పేరు గల సముద్ర సింహం అన్నింటికంటే ముందుగా వీడియో గేమ్ శిక్షణ పూర్తి చేసింది. తన ముక్కును ఉపయోగించి స్పైక్ వీడియో గేమ్ ఆడుతుంది. ఆడడమే కాదు గేమ్ కూడా గెలుస్తోంది. స్పైక్ గేమ్ గెలిచిన వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.
స్పైక్ పేరు గల సముద్ర సింహం వీడియో గేమ్ (Sea Lion Video Game Viral Video) ఆడుతున్న వీడియోను 'The Independent' అనే యూట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేసింది. యూఎస్ నేవీ రీసెర్చ్ ప్రాజెక్ట్‌లో భాగంగా సీ లయన్ బీట్స్ వీడియో గేమ్ ఆడుతున్నాయి అని పేర్కొంది. ఈ వీడియో చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకి నెట్టింట లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.
సముద్ర సింహాలు సాధారణంగా చాలా ప్రశాంతమైన జీవులు. ఇవి బాహ్య చెవి ఫ్లాప్‌లు, పొడవాటి ఫోర్‌ఫ్లిప్పర్లు, నాలుగు కాళ్లపై కదిలే సామర్థ్యం ఉంటుంది. వీటి సగటు జీవితకాలం 20-30 సంవత్సరాలు. మగ సముద్ర సింహం సగటున 300 కిలోల (660 పౌండ్లు) బరువు, 2.4 మీ (8 అడుగులు) పొడవు ఉంటుంది. ఆడ సముద్ర సింహం 100 కిలోల (220 పౌండ్లు) బరువు, 1.8 మీ (6 అడుగులు) పొడవు ఉంటుంది. అతిపెద్ద సముద్ర సింహాలు 1,000 kg (2,200 lb) బరువు, 3.0 m (10 ft) పొడవు పెరుగుతాయి. సముద్ర సింహాలు ఒకేసారి పెద్ద మొత్తంలో ఆహారాన్ని తీసుకుంటాయి. వాటి శరీర బరువులో 5–8% (సుమారు 6.8–15.9 కిలోలు) ఆహారం తింటాయి. సముద్ర సింహాలు మాంసాహారులు. భోజనాన్ని అవి పూర్తిగా మింగేస్తారు రోజుకు 40 పౌండ్ల వరకు తినవచ్చు.
Also Read: BRO Movie: ఆసక్తికరంగా పవన్ కల్యాణ్-సాయి తేజ్ మూవీ టైటిల్.. స్టైలిష్ లుక్‌లో పవర్‌స్టార్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.