Secret Whatsapp Tips: ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తోంది. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్.. ఇలా రకరకాల సోషల్ ప్లాట్ ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సోషల్ యాప్స్‌తో కొత్త స్నేహాలు, పరిచయాలకు కొదువ లేకుండా పోయింది. ఆ స్నేహాలు, పరిచయాలే ప్రేమలు, పెళ్లిళ్లకు కూడా దారితీస్తున్న ఘటనలు అనేకం కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. అదే సమయంలో సోషల్ మీడియా ప్రేమికులు, భార్యాభర్తల మధ్య చిచ్చు రేపుతున్న ఘటనలు కూడా అడపాదడపా చూస్తూనే ఉన్నాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొంతమంది సోషల్ మీడియాకు బాగా ఎడిక్ట్ అయిపోయి... పొద్దస్తమానం అందులోనే తలదూర్చి గడిపేస్తుంటారు. దీంతో వారి గర్ల్‌ఫ్రెండ్ లేదా బాయ్‌ఫ్రెండ్స్‌కి లేనిపోని అనుమానాలు తలెత్తుంటాయి. తమ బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్ అంతసేపు వాట్సాప్‌లో ఎవరితో చాట్ చేస్తున్నారా అన్న ప్రశ్నలు తొలుస్తుంటాయి. అయితే ఆ విషయం తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇందుకోసం వాట్సాప్‌లో ఓ సీక్రెట్ టిప్ ఉంది. 


ఆ సీక్రెట్ టిప్ ఏంటంటే.. :


1)మీ గర్ల్‌ఫ్రెండ్ లేదా బాయ్‌ఫ్రెండ్ ఫోన్ పాస్‌వర్డ్ మీకు తెలసి ఉండాలి. ఫోన్ అన్‌లాక్ చేసి వాట్సాప్ ఓపెన్ చేయాలి.
2)ఆ తర్వాత వాట్సాప్‌లో కుడివైపు కార్నర్‌లో కనిపిస్తున్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి
3)అందులో సెట్టింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే చాలా ఆప్షన్ వస్తాయి
4)ఇప్పుడు స్టోరేజ్ అండ్ డేటా ఆప్షన్‌ని ఎంచుకోండి.
5)వాట్సాప్‌ స్క్రీన్‌పై చాలానే ఆప్షన్లు కనిపిస్తాయి.. అందులో మేనేజ్ స్టోరేజ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
6) వాట్సాప్ కాంటాక్ట్స్‌కి సంబంధించిన డేటా అక్కడ కనిపిస్తుంది. అందులో మొదటి పేరు ఎవరిది ఉంటే.. వారితోనే ఎక్కువ సేపు చాట్ చేసినట్లు.


Also Read: Russia-Ukraine Conflict: దోస్త్.. ఎండాకాలంలో చల్లటి బీర్స్  దొరకవంట.. బీర్ కంపెనీలపై ఉక్రెయిన్ సంక్షోభం ప్రభావం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook