విదేశీయులు ఓ భవనంపై శృంగారంలో పాల్గొంటుండగా మరెవరో చిత్రీకరించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది కూడా ఆ విదేశీయులు శృంగారంలో పాల్గొంటుంది ఇంకెక్కడో కాదు.. ఓ పోలీసు స్టేషన్ భవనంపైనే అని ఆ వీడియోను చూస్తే స్పష్టం అవుతుందని సోషల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లా గంటాఘర్ పోలీసు స్టేషన్ భవనంపై ఈ రాసలీలలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతానికి ఆ వీడియోలో వున్న విదేశీయులు ఎవరనేది ఇంకా గుర్తించలేదు. భవనంపైకి ఎక్కేందుకు పోలీసు స్టేషన్‌లోంచి తప్ప మరో మార్గం లేదు. అంటే స్టేషన్‌లో పోలీసుల కళ్లుగప్పి టెర్రస్‌పైకి చేరుకునే అవకాశం కూడా లేదు. అటువంటప్పుడు ఇదంతా పోలీసులకు తెలిసే జరిగిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 


ఇదే విషయమై ఫోన్‌లో ఉదయ్‌పూర్ జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ గోయల్ వివరణ కోరే ప్రయత్నం చేసింది జీ మీడియా. జీ మీడియాతో ఫోన్ లో మాట్లాడిన జిల్లా ఎస్పీ.. అటువంటి వీడియోలు వాస్తవమైనవి అనడానికి వీల్లేదని కొట్టిపారేశారు. అది పోలీసు స్టేషన్ పైనే జరిగిందని భావించడం తగదు అని బదులిచ్చారు ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ గోయల్. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన ఈ వివాదంపై రాజస్థాన్ పోలీసు శాఖ ఏమని స్పందిస్తుందో చూడాలి మరి!!