Shocking king cobra growling gets petrified video goes viral: పాములకు చెందిన వెరైటీ వీడియోలు సొషల్ మీడియాలో తరచుగా వైరల్ గా మారుతుంటాయి. కొన్ని చూస్తుంటే భయంకరంగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేసేవిలా ఉంటాయి. పాములకు చెందిన వీడియోలను చూడటానికి నెటిజన్లు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. అడవులు, కొండలు ఉన్న ప్రాంతాలలోని ఇళ్లలో పాములు ఎక్కువగా బైటపడుతుంటాయి. పాముల్ని చూసి కొందరు భయంతో పారిపోతుంటారు. మరికొందరు మాత్రం స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇస్తారు. పాములకు ఆపద కల్గించకూడదని చెప్తుంటారు. కానీ కొందరు పాముల పట్ల కూడా సైకోలుగా ప్రవర్తిస్తుంటారు. కుట్టిన పామును కూడా మరల కొరుకుతారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ఇటీవల పాములకు చెందిన అనేక వెరైటీ ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. యూపీకి చెందిన వ్యక్తిని పాము పగబట్టిందని చెప్తున్నారు. దీనివల్ల అతను.. పామంటే భయంతో వణికిపోతున్నారు. ఎక్కడ పాము వచ్చి కాటు వేస్తుందోఅని భయపడిపోతున్నారు. కానీ కొందరు మాత్రం అదేంలేదని కూడా కొట్టిపారేస్తున్నారు. పాములన్ని విషపూరితమైనవి కావు. కేవలం కొన్ని పాములు మాత్రమే మనిషిని చనిపోయేలా విషంను శరీరంలో వదులుతాయి. కొన్ని పాములు అత్యంత భయంకరమైన విషయంను కల్గి ఉంటాయి. ఇవి మనుషులను కాటు వేయగానే నిముషాల్లోనే చనిపోతుంటాడు. కింగ్ కోబ్రాలు, బ్లాక్ మాంబాలు పాములు చిన్న పాముల్ని తినేస్తుంటాయి. ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.



పూర్తివివరాలు..


కింగ్ కోబ్రాలు దట్టమైన అడవిలో ఎక్కువగా జీవిస్తుంటారు. ఇవి ఎక్కువగా ఆకులు, చెట్ల పొదల్లో ఉంటాయి. అడవిలో సంచరిస్తు చిన్న పాముల్ని వేటాడుతుంటాయి. ఈ క్రమంలో ఒక భారీ కింగ్ కోబ్రా మరో పామును వేటాడింది. అంతేకాకుండా.. అది నోట్లోపెట్టుకుని కోపంగా తినేందుకు ట్రైచేస్తుంది. ఇంతలో అక్కడ కొందరు పామును గమనించి దాన్ని అదిలించే ప్రయత్నంచేశారు.


దీంతో పాముకోపంతో.. హిస్ హిస్ అనే శబ్దం చేసుకుంటూ అక్కడే కాసేపు పడగ విప్పి కూర్చుంది. ఆ తర్వాత పాము మెల్లగా అక్కడ  నుంచి దూరంగా వెళ్లిపోయింది. సదరు వ్యక్తులు తీసిన వీడియోలో పాము హిస్ శబ్దం స్పష్టంగా రికార్డు అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. చూసి షాక్ కు గురౌతున్నారు. కొందరు పాము శబ్దం విని షాక్ కు గురౌతున్నారు. ఇంత భయంకరమైన శబ్దమేంటని కూడా కామెంట్ లు చేస్తున్నారు.