Shocking man shocked to find snake hiding shoe video goes viral: వర్షాకాలంలో  పాములు ఎక్కువగా బైట కన్పిస్తుంటాయి. అవి మన ఇళ్లలోనికి ప్రవేశిస్తుంటాయి. వర్షం వల్ల బైటవాతావరణం అంతా చల్లగా ఉంటుంది. దీంతో అవి వెచ్చగా ఉంటాయని మన ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయి. బట్టలలో, కిటికీలు, బీరువాలలో పాములు కన్పిస్తు ఉంటాయి. గుబురుగా చెట్లు ఉన్న చోట, ఎలుకలు ఉన్న చోట పాములు ఉంటాయి. అదే విధంగా మన ఇళ్లలో కొన్నిసార్లు పాములు బూట్లలోను దూరిపోతుంటాయి. ఇంట్లో ఏదైన కన్నం ఉంటే దాని గుండా బైటకు వెళ్లి, లోపలికి వస్తుంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇటీవల పాములు హెల్మెట్ లలో కూడా దూరిపోయి కూర్చుని ఉంటున్నాయి. స్కూటీ డిక్కీలో, కారులోని బంపర్ లలో కూడా దాక్కుని ఉంటున్నాయి. కారు సీటు కింద కూడా పాములు కన్పిస్తున్నాయి. చాలా మంది పాములను కన్పించగానే ఆపద కల్గించడానికి ఇష్టపడరు. కొందరు పాములను పట్టేవారికి సమాచారం ఇస్తారు.  కొన్నిసార్లు పాములు కాటు వేస్తుంటాయి. దీంతో  కొందరు పాముల్ని రివర్స్ లో కొరికి పైశాచీకంగా ప్రవర్తిస్తుంటారు.


పాములను కొరకడం, గాయపర్చడం చేస్తుంటారు. పాములు పగపడుతాయిని కొందరు చెప్తుంటారు. పాములకు సంబంధించిన  ఏ ఘటననైన తరచుగా వార్తలలో ఉంటుంది. వీటిలో కొన్ని ఆశ్చర్యానికి గురిచేసేలాను, షాకింగ్ కల్గించేవిగాను ఉంటాయి. ఒక షాకింగ్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు..



వానాకాలంలో పాములు ఇళ్లల్లోకి వస్తుంటాయని పెద్దలు చెప్తుంటారు. కొన్నిసార్లు అవి బూట్లలో కూడా దాక్కుంటాయి. అచ్చం.. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది.  కొన్నిరోజులుగా కుండపోతగా వర్షం కురుస్తుంది. ఎక్కడ చూసిన నీళ్లు కన్పిస్తున్నాయి. జన జీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో చాలా మంది వర్షాకాలంలో బూట్లు వేసుకోరు. కేవలం చప్పల్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతో బూట్లను పక్కన పెడుతారు. కొన్నిసార్లు బూట్లలో పాములు దూరిపోయి కూర్చుంటాయి.


ఒక వ్యక్తి బూట్లు వేసుకునేందుకు ఇంట్లోంచి బయటకు వచ్చాడు. అతడు చెప్పులు వేసుకొవడానికి ప్రయత్నించాడు.ఇంతలో దాని పక్కన ఉన్నబూట్ల నుంచి ఏదో కదిలిన సౌండ్ వచ్చింది. వెంటనే.. అతను ఏంటా అని చూశాడు. అప్పుడు ఒక పాము ఉండటం గమనించాడు.వెంటనే స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికి చేరుకుని.. పామును వారు పట్టుకునే ప్రయత్నం చేశారు.


Read more: Baby born with teeth: వావ్.. చిన్నారికి బై బర్త్ 32 పళ్లు.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన వీడియో..  


బూట్లను కదిలించగానే పాము బుసలు కొడుతూ ఒక్కసారిగా బైటకు వచ్చేసింది. దీంతో అక్కడున్న వారంతా భయంతో దూరంగా వెళ్లిపోయారు. స్నేక్ మ్యాన్ పామును చాకచక్యంగా బంధించాడు.ఈ వీడియో మాత్రం వైరల్ గా మారింది. వానాకాలంలో ఎంతో అలర్ట్ గా ఉండాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. నెటిజన్లు మాత్రం ఎంత రిస్క్ తప్పిందంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.