Mobile Phone Blast Video Viral: దేశవ్యాప్తంగా ఈ మధ్య మెుబైల్ ఫోన్లు తెగ పేలిపోతున్నాయి. తాజాగా కేరళలో ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. 76 ఏళ్ల ఇలియాస్ అనే వ్యక్తి యెుక్క చొక్కా జేబులో ఫోన్ పేలింది. అతడు హోటల్లో టీ తాగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

త్రిసూర్ జిల్లాలోని మరోట్టిచల్ ప్రాంతంలో గురువారం దాదాపు 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో వృద్ధుడికి ఎటువంటి గాయాలు కాలేదు. అప్రమత్తమైన ఇలియాస్ మెుబైల్ ను కింద పడేసి మంటలను ఆర్పివేశాడు. సంవత్సరం కిందట ఆ ఫోన్ ను ఓ మెుబైల్ షాపులో వెయ్యి రూపాయలకు కొనుగోలు చేసినట్లు అతడు వివరించాడు.  దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. తాజాగా ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. నెల రోజుల వ్యవధిలో రాష్ట్రంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం మూడోది. 



వీడియో ఓపెన్ చేస్తే.. టీ తాగేందుకు ఓ వృద్ధుడు హోటల్ కు వెళ్లాడు. అతడు కూర్చుని ఉండగా..  ఓ యువకుడు టీ తయారు చేస్తున్నాడు. సడన్ గా జేబులో ఉన్న ఫోన్ ఒక్కసారిగా పేలింది. వెంటనే జేబులోంచి ఫోన్ ను బయటకు విసేరిసిన వృద్ధుడు బట్టలకు అంటుకున్న మంటలను ఆర్పేశాడు. అతడికి అదృష్టవశాత్తు ఎటువంటి గాయాలు కాలేదు. పేలిన ఫోన్ సాధారణ కీప్యాడ్ ఫోన్. గత నెల 24న ఇదే త్రిసూర్ జిల్లాలో 8 ఏళ్ల విద్యార్థిని మొబైల్‌లో వీడియో చూస్తుండగా పేలింది. దీంతో ఆ బాలికకు తీవ్ర గాయాలయ్యి మరణించింది. కోజికొడ్ లో ఓ వ్యక్తి ప్యాంటు జేబులో ఉంచిన ఫోన్ బ్లాస్ట్ అవ్వడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. 


Also Read: Leopard Attack Viral Videos: అడుగులో అడుగేసుకుంటూ సైలెంటుగా వచ్చిన చిరుత.. అక్కడే నిద్రిస్తున్న వ్యక్తి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.