Shocking Viral Video: అక్కడొక లోతైన డ్రైనేజ్. ఓ చిన్నారి అలా నడుస్తూ..హఠాత్తుగా అందులో పడిపోతాడు. ఆ వెనుకే ఉన్న తల్లి..నిర్ఘాంతపోతుంది. ఒక్క క్షణం ఆలోచించకుండా అందులో దూకేస్తుంది. ఆ తరువాత ఏమైంది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ వీడియోలో భయంకరమైన, ఒళ్లు గగుర్పొడిచే..కలవరం కల్గించే దృశ్యం రికార్డైంది. అందుకే ఆ వీడియో వైరల్ అవుతోంది. చిన్నారి కొడుకును రక్షించేందుకు వెనుకా ముందూ చూడకుండా 20 అడుగుల లోతైన డ్రైనేజ్‌లో దూకేసిన తల్లి వీడియో ఇది. ఈ ఘటన బ్రిటన్‌లోని క్యాంట్‌లో జరిగింది. 23 ఏళ్ల ఏమ్లీ బాత్..ఏడాదిన్నర వయసున్నకొడుకు థియే ప్రయర్‌తో కలిసి నడుస్తోంది. పొరుగింటి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియోలో కొడుకు చేయి పట్టుకుని నడుస్తున్న మహిళ దృశ్యాలున్నాయి. 


కాస్సేపటి తరువాత ఒక్కసారిగా ఆ చిన్నారి ఎందుకో తల్లి చేయి విడిపించుకుని వెనక్కి వెళ్లాడు. అక్కడొక డ్రైనేజ్ మూత వేసి ఉంది. అనుకోకుండా ఆ పిల్లోడు ఆ మూతపై అడుగేయగానే..అది తిరగబడి..ఆ చిన్నారి 20 అడుగుల లోతైన ఆ డ్రైనేజిలో పడిపోతాడు. వెనుకనే వస్తున్న ఆ తల్లి నిర్ఘాంతపోయింది. వెనుకా ముందూ చూడకుండా..తానూ అందులో దూకేసింది. అదృష్టమేమంటే అప్పటికి ఆ పిల్లోడు కింద లోతువరకూ వెళ్లలేదు. క్షేమంతా కొడుకుని రక్షించి బయటకు తీయగలిగింది ఆ తల్లి. పెద్దగా గాయాలు కూడా కాలేదు. కానీ ఆ చిన్న జర్క్ మాత్రం ఆ తల్లిని షాక్‌కు గురి చేసింది.



ఈ సంఘటనను ఆ తల్లి తన ఫేస్‌బుక్ ఎక్కౌంట్‌లో షేర్ చేసింది. నేనిలా చేస్తానని నాకే తెలియదు. నా కొడుకు కష్టంలో ఉన్నప్పుడు నేను కాపాడగలిగాను. నా కొడుకు చనిపోయాడని భయమేసింది. వెంటనే డ్రైనేజ్ మూత తీసి చూస్తే..నన్ను పిలుస్తున్నాడు. మోకాలిలోతు వరకూ డ్రైనేజ్‌లో ఉన్నాడు. వెంటనే నేను లోపలకు దూకేశాను. వెంటనే నా కొడుకును బయటకు తీయగలిగాను అంటూ రాసుకొచ్చింది. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 


Also read : Viral News: 23 ఏళ్లు కేవలం సాండ్‌విచ్‌లతోనే బతికేసింది... హిప్నటిజంతో ఆమె జీవితంలో ఊహించని మిరాకిల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి