Fighting in Zee Malayalam News Channel Studio Live Debate: కేరళలో సిల్వర్‌ లైన్‌ రైల్వే ప్రాజెక్ట్‌ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీవీ స్టూడియో డిబేట్‌లోనే వాదనలు శృతిమించి ఇద్దరు ఘర్షణ పడిన దృశ్యాలు రికార్డయ్యాయి. జీ మళయాళం టీవీ ఛానెల్‌ స్టూడియోలో ఇద్దరు నేతలు బాహాబాహీకి దిగిన దృశ్యాలు రికార్డయ్యాయి. డిబేట్‌లో పాల్గొన్న రెండు పార్టీల నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. డిబేట్‌ కొనసాగుతున్న సమయంలోనే స్టూడియోలో ఉన్న కాంగ్రెస్‌పార్టీకి చెందిన నాయకుడిపై లెఫ్ట్‌ పార్టీ నాయకుడు దాడికి పాల్పడ్డాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరువనంతపురం - కాసరగోడ్ మధ్య కేరళ ప్రభుత్వం సిల్వర్‌లైన్‌ రైల్వేప్రాజెక్ట్‌ చేపట్టింది. 530 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ రైల్వే ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం 63వేల 941 కోట్ల రూపాయలు. ఈ సెమీ హైస్పీడ్‌ రైల్‌ ప్రాజెక్ట్‌ను కె-రైల్‌ ప్రాజెక్ట్‌ అని కూడా పిలుస్తున్నారు. దీనికోసమే కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ ఫండ్‌ బోర్డును ఏర్పాటుచేసింది. దీనిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అయితే, ఈ రైల్వే ప్రాజెక్ట్‌ విషయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. స్థానికంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాల సాయంతో జనం ఆందోళనలు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ తమకు తీరని నష్టం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం పట్టు వీడటం లేదు. ప్రాజెక్ట్‌ విషయంలో ముందుకే వెళ్తోంది. 


ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ప్రతిపక్షాలు కూడా వారికి మద్దతు పలికాయి. అయితే, పోలీసులు బాధితుల పట్ల కర్కశంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. కేరళలో హాట్‌టాపిక్‌గా మారిన ఈ అంశంపై జీ మళయాళం న్యూస్‌ ఛానెల్‌లో డిబేట్‌ నిర్వహించారు. డిబేట్‌ జరుగుతున్న సమయంలో సాధారణంగానే అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య వాదోపవాదాలు కొనసాగాయి. కానీ, స్టూడియోలో ఉన్న కాంగ్రెస్‌ ప్రతినిధి.. సీఎం పినరయి విజయన్‌ ప్రజల ఆకాంక్షలను గౌరవించడం లేదని ఆరోపించారు. ప్రజలపట్ల పోలీసులు రాక్షసంగా ప్రవర్తించారని దుయ్యబట్టారు. ఆ సమయంలో స్టూడియోలోనే ఉన్న లెఫ్ట్‌ ప్రతినిధి సహనం కోల్పోయారు. కాంగ్రెస్‌ పార్టీ నేతపై ఛానెల్‌ డిబేట్‌ లైవ్‌లోనే దాడి చేశారు. ఈ దృశ్యాలు టీవీలో ప్రసారమయ్యాయి.



Also read : Sarkaru Vaari Paata Story: మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా పూర్తి స్టోరీ ఇదేనా?


Also read : WhatsApp Trick: ఈ ట్రిక్‌తో టైపింగ్ అవసరం లేకుండానే ఎవరికైనా టెక్స్ట్ మెసేజ్ పంపొచ్చు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook