Charging Tips: మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా..ఈ టిప్స్ పాటించండి
Charging Tips: స్మార్ట్‌ఫోన్ నిత్య జీవితంలో ఓ భాగంగా మారిపోయింది. ఫోన్ వినియోగం ఎక్కువయ్యే కొద్దీ ఛార్జింగ్ సమస్య వెంటాడుతుంటుంది. మీ ఫోన్ త్వరగా ఛార్జింగ్ అయిపోతుందా..అయితే ఈ టిప్స్ పాటించండి..
Charging Tips: స్మార్ట్‌ఫోన్ నిత్య జీవితంలో ఓ భాగంగా మారిపోయింది. ఫోన్ వినియోగం ఎక్కువయ్యే కొద్దీ ఛార్జింగ్ సమస్య వెంటాడుతుంటుంది. మీ ఫోన్ త్వరగా ఛార్జింగ్ అయిపోతుందా..అయితే ఈ టిప్స్ పాటించండి..
మీ స్మార్ట్‌ఫోన్ త్వరగా ఛార్జింగ్ అయిపోతుందా..మేం చెప్పే ఈ టిప్స్ పాటిస్తే మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అవకపోవడమే కాకుండా..బ్యాటరీ బ్యాకప్ మిగులుతుంది. ప్రస్తుత రోజుల్లో నిత్య జీవితంలో స్మార్ట్‌ఫోన్ ఎంత కీలకంగా మారిందంటే..ప్రతి పనీ ఫోన్‌తోనే అవుతోంది. అటువంటప్పుడు ఫోన్ బ్యాటరీ మంచి కండీషన్‌లో ఉండాలి. లేదా ఫోన్ ఛార్జింగ్ ఉండేట్టు చూసుకోవాలి. అందుకే ఫోన్ కొనేటప్పుడు బ్యాటరీ బ్యాకప్ పరిశీలిస్తుంటాం. అయినా సరే ఛార్జింగ్ సమస్య తరచూ ఎదుర్కొంటూనే ఉంటున్నాం. మనం చేసే కొన్ని రకాల పనులే దీనికి కారణం. మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అవకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదో పరిశీలిద్దాం...
ఛార్జర్ మార్చకూడదు
సాధారణంగా అందరూ చేసే పొరపాటు ఇదే. కంగారులో లేదా ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు మనం వాడే ఛార్జర్ అదే కంపెనీకు చెందిందా లేదా అనేది గమనించం. అందుబాటులో ఏదుంటే దాంతో ఛార్జింగ్ పెట్టేస్తుంటాం. ఛార్జింగ్ పిన్ సరిపోతుందా లేదా అనేది మాత్రమే చూస్తాం. కంపెనీ ఏదనేది చూడనే చూడం. ఫోన్ స్లో ఛార్జింగ్‌కు ప్రధాన కారణమిదే. ఎందుకంటే మీరు మీ ఫోన్ కంపెనీ ఛార్జర్ ఉపయోగించకపోతే..ఛార్జింగ్ అదే స్పీడ్‌తో అవదు.
ఛార్జింగ్ పోర్ట్ ఎలా ఉంది
మీ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లో కాస్త సమస్య ఉన్నా సరే ఛార్జింగ్ సరిగ్గా ఎక్కదు. లేదా ఛార్జింగ్ స్లో అవుతుంది. కేబుల్ కనెక్షన్ లేదా పిన్ సరిగా ఉందా లేదా అనేది ముఖ్యంగా పరిశీలించాలి. ఫోన్ ఛార్జింగ్ సమస్య ఎప్పుడు వచ్చినా సర్వీస్ సెంటర్‌లో చూపించి..ఛార్జింగ్ పోర్ట్ సరి చేసుకోవాలి.
వైర్‌లెస్ ఛార్జింగ్ మంచిదేనా
ప్రస్తుతం అంతా వైర్‌లెస్ ఛార్జర్ల ట్రెండ్ నడుస్తోంది. కానీ ఇది ఎంతమాత్రం మంచిది కాదని చాలా తక్కువమందికి తెలుసు. కేబుల్‌తో ఛార్జింగ్ పెట్టుకునేంత ఉత్తమం మరేదీ లేదని తెలుసుకోవాలి. వైర్‌లెస్ ఛార్జర్లతో ఛార్జింగ్ పెట్టుకోవడం వల్ల..ఇండక్షన్ కాయిల్ త్వరగా హీటెక్కిపోతుంది. ఫోన్ ఛార్జర్ పాడైపోతుంది. అందుకే ఇటువంటి చిన్న చిన్న విషయాల్ని గుర్తుంచుకుంటూ ఛార్జింగ్ పెట్టుకుంటే..ఛార్జింగ్ త్వరగా ఎక్కడమే కాకుండా బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది. ఇక మరో ముఖ్య విషయం ఫోన్ ఛార్జింగ్ ఎప్పుడూ 100 శాతం పూర్తయ్యాక తీసేయడం మంచిది. అంతేకాదు..ప్రతి అరగంటకోసారి..గంటకోసారి ఛార్జింగ్ పెడుతూ ఉండటం కూడా మంచిది కాదు. మీ ఫోన్ ఛార్జింగ్ 20-30 శాతం వరకూ వచ్చిన తరువాత అప్పుడు ఫుల్ ఛార్జింగ్ పెట్టుకునే అలవాటు మంచిది.
Also read: Viral News: పెరిగిన నిమ్మకాయ, ఎండుమిర్చి ధరలు.. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook