Viral Video: కొంత మంది పాపులారిటీ కోసం వినూత్నంగా ఏదైనా చేయాలని భావిస్తుంటారు. ఇలాంటి విషయాల్లో అమెరికా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొత్తగా ఏదైనా ట్రెండ్ వస్తే.. దానిని అంతా ఫాలో అవుతుటారు. సెలెబ్రెటీలు అయితే ఇంకా ఎక్కువగా ఇలాంటి విషయాల్లో ముందుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలాంటి ట్రెండ్స్​లో ఇటీవల బాగా పాపులర్​ అయ్యింది పాములతో ఫొటో షూట్స్​. నిజమైన పామును ముద్దాడుతూ.. లేదా పామును మెడకు చుట్టుకుని ఫొటోలకు ఫోజులివ్వడం సాధారణంగా చూస్తుంటాం.


ఇలాంటి వీడియోల నుంచి స్పూర్తి పొందిన.. అమెరికాకు చెందిన 21 ఏళ్ల సింగర్​ మేయితా.. నిజమైన పాముతో షూటింగ్​ చేసేందుకు సిద్ధమైంది. అనుకున్నట్లుగానే.. ఇలా ఓ నల్ల పాము, ఓ తెల్ల పాముతో సాంగ్​ వీడియో షూట్​ చేస్తుడగా అమెరికా అనుకోని షాక్ తగిలింది.


ఏమైందంటే..


నల్లటి పామును ఆమె తన గుండెలపై పెట్టుకుని వీడియో, ఫొటోలకు ఫోజులిస్తుండగా.. కొద్ది సేపు ఈ షూట్​ బాగానే సాగింది. ఇంతలో ఆ నల్ల పాముకు ఏమైందో ఏమో గానీ.. సింగర్​ ముఖంపై కాటేసింది.


వెంటనే అప్రమత్తమైన ఆ సింగర్​ పామును విడిపించుకుని పక్కకు జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ సింగరే స్వయంగా సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేయడం విశేషం. ఆ వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది. మరి వీడియోను మీరు చూసేయండి.


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Maeta (@maetasworld)


Also read: Bride Groom funny video : గుర్రం ఎక్కుదామంటే పబ్లిక్‌లో పెళ్లికొడుకు ప్యాంట్ చిరిగింది..


Also read: Viral Video: చలికి భయపడి ఏకంగా పొయ్యిపైనే కూర్చొని స్నానం చేసిన చిన్నోడు.. వీడియో చూస్తే షాక్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook