Cobra snake on fan in karnataka: చాలా మందికి పాములంటే చచ్చేంత భయం. పాములు ఎక్కడైన కన్పించిందంటే చాలు. ఆ ప్రదేశాల జోలికి అస్సలు పోరు. పాములంటే భయంతో వణికిపోతుంటారు. ఇంట్లో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. పాములు ఎక్కువగా దట్టమైన అడవులు, చెట్లకు దగ్గరగా ఉన్న ఇళ్లలో ఎక్కువగా కన్పిస్తుంటాయి. పంట పోలాల వంటి  ప్రదేశాలలో పాములు ఉండటం మనం తరచుగా చూస్తుంటాం. కొన్నిసందర్భాలలో పాములు.. మనుషుల్ని కాటువేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొందరు పాములను దేవతలుగా కొలుస్తారు. పాములు కన్పిస్తే వాటికి ఆపద కల్గించకుండా స్నేక్ సొసైటీవారికి సమాచారం ఇస్తారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



పాములను పట్టుకునిఅడవుల్లో వదిలేయాలని చెబుతుంటారు. ఇదిలా ఉండగా.. మరికొందరు మాత్రం దీనికి భిన్నంగా ఉంటారు. కాటు వేసిన పాము మీద తమ ప్రతాపం చూపిస్తారు. పామును చంపి మరీ ఆస్పత్రికి తీసుకెళ్తారు. తమకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలని డాక్టర్లకు చెబుతుంటారు. ఇలాంటి ఘటనలు కూడా అనేకం జరిగాయి. ఇక పాములకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. పాముల కంటెంట్ ను చూడటానికి నెటజన్ లు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. ఇదిలా ఉండగా.. కర్ణాటకలోని హసన్ లో ఒక పాము ఫ్యాన్ మీద  ప్రత్యక్షమైంది. ఈ వీడియో ప్రస్తుం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు..


 కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సకలేష్ పూర్ గ్రామంలో ఒక ఇంట్లో పైకప్పు నుంచి పాము వచ్చి ఫ్యాన్ ను పట్టుకుని వేలాడుతూ ఉంది. అంతేకాకుండా.. అది ఎటు వేళ్లలేక ఫాన్ ను చుట్టేసుకుంది.. బుస్ బుస్ అంటూ శబ్దాలు చేస్తు అక్కడే కూర్చుంది. ఆ ఇంట్లోని వాళ్లు గదిలోకి వచ్చి.. ఏంటా శబ్దం అంటూ వింతగా పైకి చూశారు. ఒక్కసారిగా వారి గుండె ఆగినంత పనైంది. అక్కడ ఒక పాము ఫ్యాన్ ను చుట్టుకుని అటు ఇటు వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. దీంతో వారు వెంటనే బైటకు వెళ్లిపోయి, పాములను కాపాడే స్థానికుడైన దస్తగిరీ అనే వ్యక్తికి ఫోన్ చేశారు. ఇతగాడు పాములు పట్టడంలో మంచి టాలెంట్ అన్న వ్యక్తి.


అయితే.. దస్తగీరి ఆలస్యం చేయకుండా బాధితుడి ఇంటికి చేరుకున్నాడు. పామును చాకచక్యంగా పట్టుకుని దగ్గరలోని అడవికి వెళ్లి వదిలేశాడు.  ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో.. జాగ్రత్తగా ఉండాలి. ఎంత ప్రమాదం తప్పిందంటూ కూడా కామెంట్ లు చేస్తున్నారు.మరికొందరు మాత్రం పాములతో ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలి, వర్షాకాలంలో మరింత డెంజర్ అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియోచూసి బాబోయ్.. ఎంత పెద్ద పాము.. చూస్తేనే భయమేస్తోందంటూ తమ అభిప్రాయం వ్యక్తి చేస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter