Cobra Snake viral video: సోషల్ మీడియాలో డైలీ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని పెళ్లికి సంబంధించిన వెరైటీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. మరికొన్నిసార్లు పాముల వీడియోలు కూడా ఇటీవల తెగ వార్తలలో ఉంటున్నాయి. మరేంటో దీనికి డిమాండ్ కూడా బాగా ఉన్నట్లు తెలుస్తొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొంత మంది నెటిజన్లు మాత్రం.. వెరైటీ ఉన్న పాముల వీడియోలు వెతికి మరీ చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారంట. అందులో వింతైన పాములు, రంగు రంగుల పాములు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అంతే కాకుండా.. పాములకు అపకారం తలపెట్టొద్దని పండితులు ముందు జాగ్రత్తలు చెబుతుంటారు.



 



కొంత మంది పాముల వీడియోలు కాదు కదా.. దాని పేరు ఎత్తేందుకు కూడా అస్సలు ధైర్యం చేయరు. ప్రస్తుతం ఒక పాముల వీడియో మాత్రం తెగ ట్రెండింగ్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు.


పూర్తి వివరాలు..


పాములకు కొన్ని జంతువులతో బద్ద విరోధం అంటు చెప్తుంటారు. కప్పలు, ముంగీసలు, గద్దలు, కుక్కలు, పిల్లులు పాములు  కన్పిస్తే దాడులు చేస్తుంటాయంట. అంతే కాకుండా.. ఇవి పాముల్ని చంపి మరీ తినేస్తుంటాయి. పాము.. పొరపాటున కూడా ఈ జంతువుల కంట కనబడకుండా ఉండేలా జాగ్రత్తగా ఉంటుంది. కానీ  కొన్నిసార్లు మాత్రం.. ముంగీసలు, గద్దలు పాములపై దాడులు చేస్తుంటాయి.


అయితే.. పాములు కూడా వీటిని అదే విధంగా కౌంటర్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక పామును కప్ప నోట్లో గట్టిగా పట్టేసుకుంది. ముందటి నుంచి పిల్లి కూడా దాడి చేస్తుంది. కానీ పాము మాత్రం తన ధైర్యంను కోల్పోకుండా.. ఒకవైపు కప్ప నోట్లో పట్టుకున్న కూడా.. బుసలు కొడుతూ పిల్లికి చుక్కలు చూపిస్తుంది.


Read more: Viral Video: బాబోయ్.. వీడు చిన్నోడు కాదూ భయ్యా.. చిచ్చర పిడుగు.. కొండ చిలువతో ఏంచేస్తున్నాడో తెలుసా..?.. వీడియో వైరల్..


ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం పాము ధైర్యానికి ఫిదా అవుతున్నారు. పాము తనను చంపేందుకు ఎనిమీస్ అందరు ఒక్కసారి దాడిచేసిన కూడా తన ధైర్యంను వదలట్లేదని కామెంట్లు చేస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter