Snake found on goddess nagadevatha idol in odela peddapalli district:  వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. అడవికి సమీపంలో ఉన్న ప్రాంతాల నుంచి పాములు బైటకు వస్తుంటాయి.  ఈ క్రమంలో.. కొన్నిసార్లు పాములు ఎలుకల కోసం ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయి. సాధారణంగా పాములు జనావాసాల్లో చాలా అరుదుగా కన్పిస్తుంటాయి. కానీ పొలాలు, వడ్లు, బియ్యం వద్ద ఎలుకలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినే క్రమంలో పాములు కూడా అక్కడికి వస్తుంటాయి. పాములు కన్పించగానే చాలా మంది భయంతో వణికిపోతుంటారు. ఆ ప్రదేశం దరిదాపుల్లోకి కూడా అస్సలు వెళ్లరు. కానీ మరికొందరు మాత్రం.. పాములు కనపడితే.. వెంటనే స్నేక్ హెల్పింగ్ సొసైటీ వారికి సమాచారం ఇస్తారు. పాములకు ఆపద కల్గించకూడదని భావిస్తారు.ఈ నేపథ్యంలో కొన్నిసార్లు పాములు దేవాలయాల్లోకి ప్రవేశిస్తుంటాయి. దేవుడి విగ్రహాల మీద పడగ విప్పుకుని మరీ ఉంటాయి. ఇలాంటి ఘటనలు గతంలో కూడా అనేక జరిగాయి. తాజాగా పెద్దపల్లిలో జరిగిన ఘటన మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



పెద్ద పల్లిలో సోమవారం అరుదైన ఘటన చోటు చేసుకుంది.  ఓదెలలోని శ్రీ పార్వతి శంభులింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ఓ నాగుపాము నాగదేవత విగ్రహం పై పడగ విప్పింది. ఈ విగ్రహం పై నుంచి కింది వరకు వెళ్ళింది. అంతే కాకుండా నాగ దేవత విగ్రహం పై పడగ విప్పి..అటు..ఇటు తిరిగింది.. పడగ తోనే.. విగ్రహం పై చాలా సేపు అలానే ఉండిపోయింది. అక్కడున్న వారు పాము కన్పించడంతో ఎంతో మహిమగా భావించారు.


అదే విధంగా ఆషాడంలో చివరి సోమవారం, నాగ పంచమికి ముందు నాగుపాములు ఆలయంకు రావడం, అది కూడా నాగు పాము విగ్రహాంను చుట్టుకోవడం చూసి అక్కడున్న వారంతా భక్తితో పులకరించి పోయారు. ఇది అమ్మవారి మహిమే అంటూ చెప్పుకున్నారు. పాము చాలా సేపు ఎటు కదలకుండా.. నాగదేవత విగ్రహం మీదే ఉండిపోయింది. భక్తులు తమ  సెల్ ఫోన్ లలో పాము వీడియోను తీసుకున్నారు.


Read more: 2 Deers battle: బార్డర్ లో కుమ్ముకున్న భారత్ ,పాక్ జింకలు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..


ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైలర్ గా మారింది. అయితే..  ఈ విషయం ఆనోటా ఈ నోటా తెలిసిన భక్తులు భారీ సంఖ్యలో అరుదైన దృశ్యాన్ని చూడడానికి భారీగా తరలివచ్చారు.  ఇదిలా ఉండగా.. భక్తులు ఎంత చప్పుడు చేసిన అక్కడ నుంచి వెళ్లడం లేదు. సాధారణంగా పాములు ఏ చిన్న అలికిడి జరిగిన వెంటనే పారిపోతాయి.  కానీ పాము  మాత్రం చాలా సేపు పడగవిప్పుకుని, నాగ దేవత విగ్రహం మీద అలానే ఉండిపోయింది. ఇది ఖచ్చితంగా నాగదేవత మహిమే అంటూ చాలా మంది చెప్పుకుంటున్నారు.