Non Venom Snakes: రంగు రంగులతో అందంగా కనిపిస్తున్న పాము తెగ బుసలు కొడుతోంది. ఎంత అందంగా ఉన్నా ముద్దాడలేము అనుకుంటారు. ఎందుకంటే విషం ఉంది.. కాటేస్తే చనిపోతామనే భయంతో. అయితే అందంగా కనిపించే ఈ పామును చూసి భయపడక్కర్లేదు. ఎందుకంటే ఈ పాముకు విషం లేదు. విషం లేని పాముల్లో ఇదొకటి. దీనిపేరు స్కార్లెట్‌ స్నేక్‌. ఈ పాము విశేషాలను ఓ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ వివరించాడు. ఆ పాము విశేషాలు పంచుకుంటూ దానితో ఆడుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ పాము విశేషాలు.. ప్రత్యేకతలు తెలుసుకుందాం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Temple Thieves: ఈ దొంగలకు దేవాలయాలు కనిపిస్తే చాలు.. దేవుడికే నిలువు దోపిడీ


నిక్‌ ద రాంగ్లర్‌ అనే సామాజిక మాధ్యమం నిర్వహిస్తున్న వ్యక్తి వన్య ప్రాణుల విశేషాలను పంచుకుంటుంటారు. అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడి జంతువుల విషయాలను వివరిస్తూ నెటిజన్లను పెంచేసుకుంటున్నాడు. అతడు చేసిన వీడియోలు మిలియన్లలో వ్యూస్‌ లభిస్తున్నాయి. ముఖ్యంగా పాములు, మొసళ్లపై వీడియోలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే స్కార్లెట్‌ పామును విశేషాలను పంచుకున్నాడు.


Also Read: Flipkart Apologise: పురుషులను కించపరిచిన ఫ్లిప్‌కార్ట్‌.. నెటిజన్ల దెబ్బకు దిగివచ్చి క్షమాపణలు


ఎరుపు, నలుపు, తెలుపు రంగులో కనిపిస్తున్న ఈ పాము పేరు స్కార్లెట్‌. ఇది అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంటుంది. ఈ పాము 3 నుంచి పది అడుగుల పొడవు వరకు ఉంటుంది. కొన్ని పాములు లావుగా.. కొన్ని పాములు సన్నగా ఉంటాయి. ఎంతో అందంగా ఉండే ఈ పాములను పెంచుకోవచ్చు. ఎందుకంటే విషం ఉండవు. విషం లేని అతి తక్కువ పాముల్లో స్కార్లెట్‌ ఒకటి. ఈ పాములు ఎక్కువ ఉండవు. చాలా అరుదైన పాముల రకాల్లో ఒకటి. ఇవి క్రిమీ కీటకాలు భోజనంగా స్వీకరిస్తాయి.

అయితే భారతదేశంలో కూడా ఈ స్కార్లెట్‌ పాము అక్కడక్కడ కనిపిస్తుంటాయి. ముఖ్యంగా జూపార్క్‌ల్లో వీటిని చూడవచ్చు. నిక్‌ దా రాంగ్లర్‌ పంచుకున్న స్కార్లెట్‌ పాము వీడియోకు నెటిజన్ల నుంచి భారీగా స్పందన లభిస్తోంది. లక్షల్లో చూడగా.. వేలల్లో లైక్‌లు ఉన్నాయి. పామును చూసి మొదట భయపడ్డా తర్వాత విషం లేని పాము అని తెలిసి హమ్మయ్య అనుకుంటున్నారు. సృష్టిలో మొత్తం ఇలా విషం లేని పాములు ఉంటే ఎంతో బాగుంటుందని నెటిజన్లు అనుకుంటున్నారు.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి