snake wrapped shiva linga in srisailam video goes viral: వర్షాకాలంలో పాములు ఎక్కువగా బైటకు వస్తుంటాయి. ఎలుకల కోసం అవి మన ఇళ్లలోనికి వస్తుంటాయి. పాములకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. కొన్ని చూసేందుకు భయం కల్గించేలా ఉంటాయి. మరికొన్ని మాత్రం ఆశ్చర్యానికి గురిచేసేవిలాను ఉంటాయి.  పాములకు సంబంధించిన వెరైటీ  ఘటనలు తరచుగా వార్తలలో ఉంటాయి. నెటిజన్ లు కూడా పాములకు సంబంధించిన వీడియోలు చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. చాలా మంది పాములు కన్పిస్తే భయంతో పారిపోతుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



మరికొందరు మాత్రం.. స్నేక్ సొసైటీవారికి సమాచారం కూడా ఇస్తారు. పాములు కాటు వేయగానే వెంటనే డాక్టర్ ల దగ్గరకు వెళ్లాలి.  కొందరు మాత్రంపాములకు ఆపద కల్గించుకూడాదని చెప్తుంటారు. ఇదిలా ఉండగా.. పాములు పగబడుతాయని కొందరు చెబుతుంటారు. కొందరు పాముల్ని భక్తితో కొలుస్తారు. పాములు కొన్నిసార్లు గుళ్లలో కన్పిస్తుంటాయి. ఈ కోవకు చెందని వీడియో ప్రస్తుతం సోషల్  మీడియాలో వైరల్ గా మారింది.



పూర్తి వివరాలు..


శ్రీ శైలంలో తొలి ఏకాదశికి ముందు అరుదైన ఘటన చోటుచేసుకుంది. శ్రీ శైలమల్లేశ్వరుడి దేవాలయ ప్రాంగణంలో.. వజ్రాల గంగమ్మ ఆలయ సమీపంలో అరుదైన ఘటన జరిగింది. అక్కడ అత్యంత పురాతనమైన చంద్రలింగం ఉంది. అక్కడ ఒక పాము వెళ్లి ఆశివలింగాన్ని చుట్టుకుని అలానే ఉండిపోయింది.శివుడికి సర్పం కంఠాభరణంలా ఉంటుందని మనకు తెలిసిందే. ఇక్కడ కూడా అచ్చం పాము వెళ్లి.. అత్యంత పురాతనమైన శివలింగాన్ని చుట్టుకుని చాలా సేపే అక్కడే కదలకుండా ఉండిపోయింది. దీన్ని చూసిన స్థానికులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.


ఈ ఘటన కాస్త వెంటనే చుట్టుపక్కల వ్యాపించింది. అందరు కూడా పెద్ద ఎత్తున ఆలయంకు చేరుకున్నారు. పాము చాలాసేపు, శివలింగాన్ని చుట్టుకుని కదలకుండా ఉండిపోయింది. కొందరు ఈ ఘటనను తమ ఫోన్ లలో బంధించారు. ఈ  వీడియో  ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  


Read more: Nita Ambani: రెండు చేతులు జోడించి పబ్లిక్ గా క్షమాపణలు చెప్పిన నీతా అంబానీ.. వీడియో వైరల్..


ఇదిలా ఉండగా.. ఆషాడమాసం ఏకాదశికి ముందు ఒక రోజు ఈ ఘటన జరగడంతో,ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఇదంతా శివయ్య మహత్యం అంటూ భక్తితో పులకరించిపోతున్నారు. ఇదిలా ఉండగా.. తొలి ఏకాదశి నేపథ్యంలో  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు కూడా ఆలయాలన్ని ముస్తాబయ్యాయి. తొలి ఏకాదశినే.. శయనీ ఏకాదశి అనికూడా పిలుస్తుంటారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి