Snakes Video: ఆ ఊళ్లో ఎక్కడ చూసినా కాటేసే కాలనాగులే.. వన్య ప్రాణి అధికారులే షాక్ అవుతున్నారు! వీడియో ఇదే..
Snakes Trending Video: ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఉళ్లో ఎక్కడపడితే అక్కడ కింగ్ కోబ్రాలు దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా జనాలపై పడి కాటేస్తున్నాయి. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకోండి.
Snakes Trending Video: చిన్న, పెద్ద తేడా లేకుండా ఎవరైనా పాములంటే భయ పడుతూ ఉంటారు. కొందరైతే వీటిని చూస్తే దాదాపు ఆఫ్ కిలో మీటర్ దూరం పరుగులు పెడుతూ ఉంటారు. కొండ ప్రాంతాల్లో జీవించే వారికి తరచుగా పాములు కనిపిస్తాయి. అంతేకాకుండా భయంకరమైన పాములు కూడా ఇళ్లలో సంచారం చేస్తూ ఉంటాయి. చాలా వరకు స్నేక్ క్యాచర్స్ వీటిని పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు. ఇలా స్నేక్ క్యాచర్స్ పాములను పట్టుకున్న వీడియోస్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇటీవలే ఉత్తరప్రదేశ్ ఓ విలేజ్‌లో ఎవ్వరూ ఊహించని సంఘన జరిగింది. సదర్ పూర్ ఊరిలో ఎటు చూసిన పాములే కనిపిస్తున్నాయట. అంతేకాదు.. దొరికినోళ్లను దోరికినట్లు కాటేస్తున్నాయట. నిజానికి పాములు ఊళ్లలో చాలా అరుదుగా కానిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా జనావాసాలు ఉండే ప్రాంతాల్లోకి అస్సలు రావు.. అయితే ఈ పాములు జనాల్లోకి వచ్చి మరీ మనుషులపై దాడి చేయడంతో అటవీ శాఖ అధికారులు ఆశ్చర్యానికి గురవుతున్నాయి. అంతేకాకుండా ఇందులో చాలా వరకు కింగ్ కోబ్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. సాధరణంగా కింగ్ కోబ్రాలు ఒక్కసారి దాడి చేస్తే కాటేయకుండా వదలవు.. అలాంటి పనులు ఊళ్లో ఎక్కడ పడితే అక్కడ ఉండడంతో ఊరి జనాలు తీవ్ర భయానికి లోనవుతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లో ని ఒక ఊరులో మొత్తం పాముల మయంగా మారింది. ఊరిలో ఎక్కడ చూసినా బుసలు కొడుతున్న నాగుపాములే కనిపిస్తున్నాయి. యూపీలోని సదర్ పూర్ గ్రామంగా నాగు పాములకు అడ్డగా మారింది. పాము కాటుకు ఇప్పటికే 5గురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నిన్న రాత్రి ఒక మహిళ పాము కాటుకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పాముల భయంతో సగం ఊరు ఇప్పటికే ఖాలీ అయ్యింది. దీంతో గ్రామ పెద్దలు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురావడంతో అక్కడ 24గంటల పాటు అటవీ, వన్య ప్రాణి అధికారులతో జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇప్పటికే దాదాపు 10 పాములను అటవీ అధికారులు పట్టుకున్నారు. మిగితా వాటిని కూడా పట్టుకుంటామని గ్రామస్తులు ఎవరూ ఆందోళన చెందవద్దని అధికారుల భరోసా ఇస్తున్నారు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.