Two-year old boy playing with giant snake: రెండేళ్ల పిల్లాడంటే ఆట బొమ్మలతో ఆడుకుంటూ, కిందా మీద పడుతూ బుడి బుడి అడుగులు వేసుకుంటూ, చిట్టిపొట్టి మాటలతో లోకం మర్చిపోయి ఆడుకుంటాడనే అనుకుంటారంతా. ఎందుకంటే చాలా మంది పిల్లల తీరు అలాగే ఉంటుంది కనుక. కానీ ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ బుడ్డోడు మాత్రం అలా కాదు. రెండేళ్ల వయసులోనే రెండు మీటర్ల పొడవైన పామును పట్టుకుని బొమ్మతో ఆడుకున్నట్టు ఆడుకుంటున్నాడు. అంత సీన్ లేదులే అని అనుకుంటున్నారా ? అయితే మీరే స్వయంగా ఈ వీడియో చూడండి.. ఆ బుడ్డోడి సీన్ ఏంటో మీకే అర్థమవుతుంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


చూశారు కదా బుడ్డోడి సాహసం! ఈ వీడియో చూశాకా మీకు ముందుగా వచ్చే డౌట్ ఏంటంటే.. ఇంతకీ ఈ పిల్లోడు ఎవరు ? ఎందుకు, ఎలా అంత ధైర్యంగా అంత పెద్ద పాముతో (Giant snake) ఆడుతున్నాడు ? అసలు అది నిజమైన పామేనా లేక బొమ్మ పామా అనే సందేహాలు వచ్చి ఉంటాయి కదా... అయితే అక్కడికే వస్తున్నాం. 


ఆస్ట్రేలియాకు చెందిన ఈ పిల్లోడి పేరు బంజో. తండ్రి పేరు మ్యాట్ రైట్. వృత్తి మొసళ్ల కేర్ టేకర్ జాబ్ (Crocodile wrangler Matt Wright). మొసళ్లు, పాములు పట్టడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. గత 20 ఏళ్లుగా అతడు ఆ పనిలోనే బతుకుదెరువును వెదుక్కుంటున్నాడు. అందుకే ఆ పనిని తన కొడుకు బంజోకు కూడా నేర్పాలనుకున్నాడు. 


అలా అనుకున్నదే తడవుగా వెళ్లి ఓ రెండు మీటర్ల పొడవైన పామును (Big snake) తీసుకొచ్చి తన ఇంటి పెరట్లో వదిలాడు. ఆ తర్వాత ఇలా బంజోకు దాని తోకను పట్టుకునే టాస్క్ ఇచ్చి అతడి ధైర్యాన్ని చెక్ చేశాడు. బంజో కూడా ఏ మాత్రం భయపడకుండా ఇలా ఆ పాము తోక (2 years old boy pulling snake tail) పట్టుకుని ఆడటం మనం వీడియోలో చూడొచ్చు. మ్యాట్ రైట్ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (snake viral videos) అవుతోంది.