Emotional Video: ఓ తల్లి తన కొడుకును దేశం కోసం సరిహద్దుకు పంపుతున్నట్లు కనిపించే చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూసిన గేటు వెనుక తల్లి కన్నీళ్లు తుడుచుకోవడం వంటి దృశ్యం ఆ ఫోటోలో కనిపిస్తుంది. దీనిని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సతీష్ దువా తన ట్వీటర్‌ ఖాతా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌ అవుతోంది. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ప్రేమను పొందుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 అతను ట్వీట్‌లో ఇలా ఎమోషనల్‌గా క్యాప్షన్ రాశారు.."దాదాపు మూడు దశాబ్దాల క్రితం నేను నా తల్లిని కోల్పోయాను. నేను ప్రతి సైనికుడి తల్లిలో మా అమ్మను చూడడమే కాకుండా..ప్రతి తల్లిలో భారత మాత చూస్తున్నాను. అమ్మా నీకు వందనం" అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు     37.8K పైగా లైక్‌లు రాగా..నెటిజన్ల నుంచి మంచి స్పందనలు వస్తున్నాయి.


ఒక నెటిజన్‌ ఈ ట్వీట్‌కు ఇలా ప్రతిస్పందించారు.."నేను ఈ చిత్రాన్ని ఎన్నిసార్లు చూశానో తెలియదు. కానీ నేను దీన్ని ఎప్పుడు చూసిన నా మనసులో ఈ చిత్రం మెదులుతుంది" అని రాశారు. మరో నెటిజన్‌ ఇలా కామెంట్‌ చేశారు.."అందరి తల్లులకు, భారత మాతకు వందల కోట్ల సార్లు వందనం. జై హింద్." అని రాసుకొచ్చారు.



రేఖా సింగ్ కథ:


సోషల్ మీడియా నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన మరో హృదయపూర్వక కథనం రేఖా సింగ్.. చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)తో జరిగిన ఘర్షణలో లాన్స్ నాయక్ షహీద్ దీపక్ సింగ్ మరణించాడు. దీపక్ సింగ్‌కు రేఖా సింగ్‌తో వివాహమై కేవలం 15 నెలలు మాత్రమే అయింది. దీపక్‌ మరణించక ఎంతో దైర్యంలో భారత సైన్యంలో చేరింది. ఇలా దేశం కోసం తల్లులు ఏదైన త్యాగం చేస్తారాని ఈ చిత్రం చెప్పకనే చెబుతుంది.


Also Read: Reduce Electricity Bill In Summers: కరెంటు బిల్లు నుంచి విముక్తి పొందేందుకు ఈ పని చేయండి..!



Also Read: Pooja Hegde Saree Pics: సారీలో పూజా హెగ్దే.. ఇలా కూడా మెరిసిపోతున్న బుట్టబొమ్మ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.