వరుడు లేకుండా వివాహం చేసుకుంటున్న 24 ఏళ్ల యువతి.. గోవాలో హనీమూన్ ప్లాన్! చరిత్రలో ఇదే మొదటిసారి
24 year old Gujarat Woman Kshama Bindu All Set to Marry Herself. ఇప్పటివరకు ఎక్కడా లేని విధంగా.. ఓ యువతి తనను తానే పెళ్లి చేసుకుంటుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంది.
24 year old Gujarat woman Kshama Bindu to Marry Herself: ఈ భూ ప్రపంచం మీద ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతీయువకులను మనం ఎందరినో చూశాం. ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకోవడం లేదా ఇద్దరు పురుషులు వివాహ బంధంతో ఒక్కటవడం చూడకున్నా.. కనీసం ఆ వార్త అయినా చదివే ఉంటాం. అయితే ఇప్పటివరకు ఎక్కడా లేని విధంగా.. ఓ యువతి తనను తానే పెళ్లి చేసుకుంటుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంది. అంతేకాదు గోవాలో హనీమూన్ కూడా ప్లాన్ చేసింది.
గుజరాత్‌కు చెందిన 24 ఏళ్ల క్షమా బిందు అనే యువతి తనను తానే విపరీతంగా ప్రేమించుకుంది. అంటే.. స్వీయ ప్రేమ అన్నమాట. బిందు ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలనుకోలేదట కానీ పెళ్లికూతురు మాత్రం కావాలనుకుందట. అందుకే బిందు తనను తానే జూన్ 11న పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం ఆమె వివాహం చేసుకోనుంది. గోత్రిలోని ఒక దేవాలయంలో ఘనంగా జరగనున్న వివాహానికి క్షమా ఐదు ప్రమాణాలు చేసినట్లు సమాచారం. పెళ్లి తర్వాత బిందు తనతో తానే 2 వారాల హనీమూన్ కూడా ప్లాన్ చేసుకుంది.
క్షమా బిందు పెళ్లిలో వరుడు మాత్రమే ఉండడు, మిగదంతా సేమ్ టు సేమ్. తనను తాను వివాహం చేసుకోవాలనే ఈ ప్రత్యేకమైన ఆలోచన మహిళల కోసమే అని బిందు చెప్పారు. ''నేను ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలనుకోలేదు. కానీ నేను పెళ్లి కూతురు కావాలని అనుకున్నాను. అందుకే నన్నే నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా. భారతదేశంలో అలాంటి వివాహం ఏదైనా జరిగిందా అని చాలా శోధన చేశా. కానీ ఎక్కడా ఇలాంటి వివాహం జరిగినట్టు లేదు. బహుశా ఇలాంటి పెళ్లి చేసుకుంటున్న మొదటి వ్యక్తి నేనే కావచ్చు' అని క్షమా బిందు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.
'స్వీయ-వివాహం అనేది మీ కోసం ఉండాలనే నిబద్ధత మరియు తన పట్ల షరతులు లేని ప్రేమ. ఇది కూడా స్వీయ అంగీకార చర్య. ప్రజలు తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటారు. నేను నన్ను ప్రేమిస్తున్నాను. అందుకే ఈ పెళ్లి. నా తల్లిదండ్రులు ఓపెన్ మైండెడ్. నా పెళ్లికి వారు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు'అని క్షమా బిందు చెప్పారు. ఈ పెళ్లిని స్వీయ వివాహం లేదా ఒంటరి వివాహం అని చెప్పవచ్చు. ఈ విషయం తెలిసిన అందరూ షాక్ అవుతున్నారు. 'భారత దేశ చరిత్రలో ఇదే మొదటి పెళ్లి', 'ఇదేందయ్యో ఇది.. ఇలాంటి ప్రేమ ఎక్కడా చూడలేదు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Bike Rider Video: అచ్చు జాన్ అబ్రహం మాదిరే.. పోలీసులను భలే బురిడీ కొట్టించిన బైక్ దొంగ!
Also Read: Hardik Patel: ప్రధాని మోదీ కోసం సైనికుడిగా పనిచేస్తా..నేడు బీజేపీలోకి హార్దిక్ పటేల్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook