Spider man and spider woman for bike reel in Delhi: కొందరు యువత వెరైటీగా ఆలోచిస్తున్నారు. ఓవర్ నైట్ లో ఫెమస్ కావడం కోసం ఏపనైన చేస్తున్నారు. కొందరు బైక్ ల మీద రొమాన్స్ చేస్తున్నారు. రకరకాల వీడియోలు, రీల్స్  తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. కొందరు రోడ్ల మీద పబ్లిక్ ప్లేసులలో రొమాన్స్ చేసుకుంటూ వీడియోలు చేస్తున్నారు.మెట్రో రైల్వే స్టేషన్లు లవర్ లకు,అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. మెట్రో లిఫ్ట్ లలో  ప్రేమికులు రొమాన్స్, స్టేషన్ లలో ముద్దులు పెట్టుకొవడం, రన్నింగ్ ట్రైన్ లోనే అందరి ముందు రొమాన్స్ చేసుకున్న అనేక ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇక.. హోలీ నేపథ్యంలో ఇటీవల ఇద్దరు అమ్మాయిలు ఢిల్లీ మెట్రోలో చేసిన హాట్ రీల్స్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రెండింగ్ మారింది. దీనిపైన పెద్ద దుమారమే చెలరేగింది. తాజాగా ఢిల్లీ రోడ్ల మీద ఇద్దరు యువతీ,యువకులు ప్రస్తుతం స్పైడర్ మెన్ సూట్ వేసుకుని రెచ్చిపోయారు.బైక్ మీద స్పెషల్ సూట్ వేసుకుని అందరని ఆశ్చర్యానికి గురిచేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గామారింది.


పూర్తి వివరాలు.. 



దేశ రాజధాని ఢిల్లీలో ఇద్దరుయువతీ యువకులు స్పైడర్ మోన్ కాస్ట్యూమ్ లు వేసుకున్నారు. అంతేకాకుండా.. రోడ్ల మీద ఇష్టమున్నట్లు ట్రావెల్ చేస్తు నానా రచ్చ చేశారు. ఢిల్లీలోని ద్వారాకనగర్ లో వీరు హల్ చల్ చేసినట్లు తెలుస్తోంది. ఆదిత్య , అంజలి అనే యువతీ యువకులు రోడ్లు మీద నానా బీభత్సం చేశారు. స్పైడర్ మెన్ కాస్ట్యూమ్ లు ధరించి,రోడ్డు మీద వెళ్తు, ఇష్టమున్నట్లు బైక్ నడిపిస్తు, ఇతరులకు ఇబ్బందులుకలిగేలా ప్రవర్తించారు. బైక్ మీద రొమాన్స్ చేసుకుంటూ రచ్చచేశారు.


Read More: Viral video: రా రా రక్కమ్మ.. పాటకు మాస్ స్టెప్పులు వేసిన పెళ్లికూతురు.. వీడియో చూస్తే ఆపుకోలేరు..


అంతేకాకుండా రోడ్డుమీద వెళ్తున్న వారికి పలకరిస్తూ వారి కాన్సట్రేషన్ దెబ్బతీసేలా ప్రవర్తించారు. కొందరు ఈ వీరి ఘనకార్యంను వీడియోతీసిసోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్త పోలీసుల కంట పడింది. వెంటనే బైక్ నంబర్ ఆధారంగా యువతీ, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు ఇలా వెరైటీ గెటప్ లతోతరచుగాస్టంట్ లు చేస్తుంటారని పోలీసుల విచారణలో తెలింది. వీరికి ఇన్ స్టాలో మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో పోలీసులు ఇలాంటి పనులు చేయోద్దంటూ వార్నింగ్ ఇచ్చి, జరిమాన విధించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో మాత్రం సామాజిక మాధ్యమంలో ట్రెండింగ్ లో నిలిచింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter