Spooky Viral Video: టిక్‌టాక్ నుంచి వచ్చిన ఈ షాకింగ్ వీడియో అందర్నీ కలవరపరుస్తోంది. ఓ ఎమ్యూజ్‌మెంట్ పార్క్ ఫెయిర్ రైడ్ కార్ తిరుగుతుండగా..ఉన్నట్టుంది ఓ కుర్రోడు మాయమౌతాడు. అందరూ దిగ్భ్రాంతికి లోనవుతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భయం గొలిపే ఈ వీడియో టిక్‌టాక్ నుంచి వెలుగుచూసింది. మలేషియా జోహోర్‌లోని ఒక ఎమ్యూజ్‌మెంట్ పార్క్‌లోని ఫెయిర్ రైడ్ ఇది. ఈ వీడియోను నూర్ ఆఫ్రినా రోష్మి షేర్ చేసింది. ముఆజ్ పక్కన ఎవరు కూర్చున్నారని ప్రశ్నిస్తూ వీడియో షేర్ చేసింది. నిజంగానే ఉలిక్కిపడతారు ఇది చూసి. ముఆజ్ ఆమె కొడుకు. ఫెయిర్ రైడ్ చేస్తుంటే..తల్లి వీడియో తీసింది. 


ముందు 5 ఏళ్ల ఆమె కొడుకు మరో బాలుడి పక్కన కూర్చుని ఉన్నాడు. ఫెయిర్ రైడ్ ఫస్ట్ రౌండ్‌లో ఆమె కొడుకు ముఆజ్ పక్కన మరో బాలుడు కూర్చుని ఉండటం స్పష్టంగా వీడియోలో కనిస్తుంది. రైడ్ రెండవ రౌండ్‌లో ముఆజ్ అలానే కూర్చుని ఉన్నాడు గానీ..పక్కనున్న బాలుడు మాయమవుతాడు. వీడియోలో కన్పించడు. ఆసలు అక్కడెక్కడా కన్పించడు.



అందరూ చూస్తుండగా రైడ్ మధ్యలోంచి ఆ బాలుడు ఎలా మాయమయ్యాడో తెలియక..భయాందోళనకు గురవుతున్నారు నెటిజన్లు. ఆ తల్లికి అసలేం అర్ధం కాదు. తానేం షూట్ చేసిందో..ఆ బాలుడు ఏమయ్యాడో తెలియక భయపడుతుంది. వైట్ షర్ట్ వేసుకున్న ఆ బాలుడు దెయ్యమేమోనని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. 


ఇందులో ఎవరూ భ్రమపడింది లేదు. ఆ తల్లి పొరపడింది కూడా కాదు. ఇద్దరూ కూర్చుని ఉన్నారు. ఆ బాలుడెవరో ఆ తల్లికి తెలియదు. వర్కర్ ఎవరైనా తోడుగా కూర్చున్నారేమేనని ఆ తల్లి అనుకుంది. కొడుకు రైడ్ వీడియో తీసేటప్పుడు తొలి రౌండ్‌లో స్పష్టంగా కూర్చునే ఉన్నారిద్దరూ. రెండవ రౌండ్ వచ్చేటప్పటికి ఆమె కొడుకు ఒక్కడే ఉన్నాడు. ఆ బాలుడు లేడు. రైడ్ పూర్తయ్యాక..ఆమె కొడుకొక్కడే దిగాడు. ఆ బాలుడు మరెక్కడా కన్పించలేదు. ఆ వీడియోను ఆ తల్లి కొడుకుకు చూపించి అడిగితే ఎక్కడికెళ్లాడో తెనకు తెలియదన్నాడు ముఆజ్. ఆ తల్లి ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. ఆ బాలుడు ఏమయ్యాడని. ఆ బాలుడెవరని. లేదా నెటిజన్లు చెబుతున్నట్టు ఆ బాలుడు దెయ్యమా..ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం లేదు. 


Also read: Train Passenger Video: రైలు బోగీలపై వేలాది మంది ప్రయాణికులు.. వీడియో చూస్తే షాక్ అవ్వడం పక్కా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.