Strange sea creature: సముద్రంలో వింతలకు విశేషాలకు కొదవే ఉండదు. ఇంకా చెప్పాలంటే.. మానవుడు అంతరిక్షంలో లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న చిన్న చిన్న గ్రహాల గురించి కనుగొన్నాడు కానీ.. భూమిపైనే ఉన్న సముద్రంలోపల ఉన్న మిస్టరీలను ఇంకా ఛేదించలేకపోతున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సముద్రంలో లక్షల రకాల జీవులను ఇప్పటికే గుర్తించినా.. నిత్యం ఎక్కడో ఒక చోట కొత్త రకమైన జీవులు బయటపడుతుంటాయి. ఇప్పుడు ఈ విషయంపై చర్చ ఎందుకంటే.. బ్రెజిల్​లో అలాంటి వింత జీవి గురించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.


అసలు విషయానికొస్తే..


దక్షిణ బ్రెజిల్​లోను కోస్ట్​లో ఓ వ్యక్తి రాత్రి పూట చేపల వేటకు వెళ్లాడు. స్టీమర్​తో వేట సాగిస్తుండగా.. ప్రశాంతమైన సముద్రం నుంచి ఒక్క సారిగా ఓ వింత ఆకారం బయటకు వచ్చింది. నిత్యం సముంద్రంలో వేట సాగించే ఆ వ్యక్తికి కూడా ఆ జీవి ఏమిటో అర్థం కాలేదు.


అయితే ఆ జీవి వింతగా ఉండటంతో ఆ వ్యక్తి భయపడి అక్కడి నుంచి వెనక్కి రావాలని నిర్ణయించుకున్నాడు. ఇదిలా ఉండగా.. ఆ జీవి అతడి స్టీమర్​ను వెంటాడింది. స్టీమర్ వేగంతో పోటీగా అది.. వెంబడించింది. ఇందుకు సంబంధిచిన వీడియోను @PedroHTunes అనే ట్విట్టర్​ ఖాతాలో షేర్ చేశారు. అయితే ఆ వీడియో తీసిన, స్టీమర్​లో ఉన్న వ్యక్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు.



ఆ వింత జీవి కళ్లు మెరుస్తూ ఉండటం.. వేగంగా ఆ వ్యక్తిని వెంబడించడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. స్టీమర్​ వేగం పెంచి ముందుకు వెళ్లిపోవడం వల్ల ఆ జీవి.. వెంబడిచడం ఆపేసింది. దీనితో ఆ స్టీమర్ నడిపే వ్యక్తి కూడా ఊపిరి పూల్చుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్​లో వైరల్ అవుతోంది.


Also read: Horrific Video: శునకంపై కర్కశత్వం.. వీడిని ఏమనాలో వీడియో చూసి మీరే చెప్పండి


Also read: Girls Google Searching: 17 శాతం మంది అమ్మాయిలు ఇంటర్నెట్ లో సెక్స్ గురించి సెర్చ్ చేస్తున్నారట!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook