Shocking Video: పిల్లలు తరచుగా సరదాగా నవ్వుతూ అనందంగా కనిపిస్తారు. చాలా మంది పిల్లలు అందరినీ నవ్వించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరు పిల్లలు చేసే చిలిపి చేష్టలకు ఎవరికైనా నవ్వురావాల్సిందే. నిత్యం పిల్లలు పెద్దలతో తమాషా చిలిపి పనులు చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే  ఇటివలే  ఓ పిల్లాడు  పారిశుద్ధ్య కార్మికుడితో  చిలిపి పని చేస్తాడు. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. పిల్లాడు చేసిన పనికి స్వీపర్ ఒక్కసారిగా వణుకుతాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


స్వీపర్‌తో పిల్లాడు ఇలా చేశాడు:


ప్రస్తుతం ఫ్రాంక్‌ వీడియోలలో పిల్లలు ఏదో మూలలో దాక్కోవడం.. ఆ తర్వాత రోడ్డుపై వెళ్తున్న వారిని భయపెట్టడానికి ప్రయత్నించడం మీరు తరచుగా చూసి ఉంటారు. అలా కాకుండా ఈ వీడియోలో ఓ ప్రత్యేకత ఉంది. చెత్త సేకరించే వ్యక్తితో ఓ పిల్లవాడు చేసిన చిలిపి పని కారణంగా పారిశుద్ధ్య కార్మికుడు భయపడడం ఈ వీడియోలో చూడవచ్చు. వీడియో చూడటానికి చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ వీడియోలో ఓ చెత్తతో ఉన్న లారీ మీరు చూడవచ్చు. అందులోంచి ఓ స్వీపర్ దిగి రోడ్డు పక్కన  ఉన్న నాలుగు చెత్త సంచులను ఆ ట్రక్‌లో వేస్తుంటాడు. స్వీపర్ మూడు సంచులను ట్రక్‌లో వేస్తాడు. ఆ తర్వాత నాలుగవ సంచి వైపు వేయబోతుండగా... సంచిలో నుంచి అకస్మాత్తుగా ఒక పిల్లాడు బయటకు వస్తాడు. దీనిని చూసి స్వీపర్ కంగారు పడిపోతాడు.



గట్టిగా ఊపిరి పీల్చుకున్నస్వీపర్:


స్వీపర్ గట్టిగా ఊపిరి పీల్చుకోవడానికి ప్రయత్నించడం ఈ వీడియోలో చూడవచ్చు. దీని తరువాత పారిశుద్ధ్య కార్మికుడు ఈ సంఘటను తలుచుకుని నవ్వడం ప్రారంభిస్తాడు. ఓవర్‌టైమ్ అనే ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. వీడియోను చూసిన నెటిజన్లు లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు.


 


Also Read: Benefits Of Mint Tea: వేసవిలో పుదీనా టీని తాగండి..మీ శరీరాన్ని రోజంతా ఫ్రెష్‌గా ఉంచుతుంది..!!


Also Read: Cyclone Asani Live Updates: తీవ్ర తుఫాన్‌గా మారిన 'అసని'... ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook