Kumari Aunty Street Food Stall: సోషల్ మీడియా, యూట్యూబ్  పుణ్యామా..  అని కొందరు ఓవర్ నైట్ లో కొందరు ఫెమస్ అయిపోతున్నారు. ప్రస్తుతం కుమారీ ఆంటీ తన ఫుడ్ స్టాల్ వల్ల ఇరు తెలుగు రాష్ట్రాలో ఎంతో ఫెమస్ అయ్యింది. ముఖ్యంగా హైటెక్ సిటీలో ఎందరో టెకీ ఉద్యోగులు ఆమె  దగ్గరు వచ్చి ఫుడ్ తింటున్నారు. ఇక్కడ తక్కువ ధరకే చికెన్, మటన్, వెజిటెరియన్ ఫుడ్ అందిస్తుంది. దీంతో ఎక్కడి నుంచి ఆమె దగ్గరకు వచ్చి ఫుడ్ తింటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో ఆమె దగ్గరకు యూట్యూబ్ ఛానెల్స్, టీవీ ఛానెల్స్ వెళ్లి కవరేజ్ ఇవ్వడంతో ఆమె దెబ్బకు ఫెమస్ అయిపోయింది. ఆమె స్టాల్ దగ్గర  ఫుడ్ కోసం క్యూకట్టి మరీ తినే పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలో రోడ్డుపైన ఇష్టమోచ్చిన్నట్లు వాహనాలను పెట్టడం వల్ల పార్కింగ్ సమస్య తలెత్తింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె స్టాల్ ను తీసేయాలని ఆదేశించారు.


Read Also: Viral News: ''నీ వల్ల మా బావ పెళ్లికి వెళ్లలేకపోయా..".. చెప్పుల షాపు ఓనర్ కు లీగల్ నోటీసులు.. స్టోరీ మాములుగా లేదుగా..


అదే విధంగా ఆమె సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ కావడంత సీఎం రేవంత్ రెడ్డి వరకు కూడా ఈ విషయం తెలిసింది. దీంతో ఆయన కుమారి ఆంటీని ప్రత్యేకంగా కలుస్తానని కూడా చెప్పారు. అదే విధంగా స్టాల్ ను పెట్టుకునేందుకు అనుమతి ఇచ్చారు. అక్కడి పోలీసులు కూడా ట్రాఫిక్ కు ఇబ్బంది తలెత్తకుండా స్టాల్ నడపాలని కూడా సూచించారు. దీంతో కుమారి ఆంటీ ఎంతో ఆనందం వ్యక్తం చేసింది.


ఇదిలా ఉండగా.. ఆమె పక్కన ఉన్న స్టాల్ నిర్వాహకులు ఆమె వల్ల మా బిజినెస్ రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు సోషల్ మీడియా, యూట్యూబ్ లు విపరీతమైన పబ్లిసిటీ ఇవ్వడం వల్ల చాలా మంది ఆమె దగ్గర ఫుడ్ కోసం వస్తున్నారని అంటున్నారు. తమ దగ్గర కూడా మంచి క్వాలిటీ ఫుడ్ దొరుకుతుందని, కానీ కొందరు ఆమెకు ప్రత్యేకంగా కవరేజ్ ఇవ్వడం వల్ల అక్కడున్న మరో  20 షాపులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని పక్క షాపు నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు.


ఏది ఏమైన ప్రస్తుతం కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ బిజినెస్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ లో నిలిచింది. కొందరు ఆమెను బిగ్ బాస్ కు పంపాలని, రాజకీయాల్లో స్టార్ క్యాంపెయినర్ గా చేయాలని కూడా కామెంట్లు పెడుతున్నారు. 
 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook