Social Media Viral Video: సాధారణంగా కోర్టులో జడ్జి ఏం తీర్పు చెబుతారో అని నిందితులు భయపడటం చూశాం. తక్కువ శిక్ష వేస్తే బాగుండు, తప్పించుకునే మార్గం ఎంటో వెతుకుతుంటారు. కానీ, ఫ్లోరిడా కోర్టులో దీనికి విరుద్ధంగా ఓ వింత ఘటన చోటుచేసుకుంది. చోరీకి పాల్పడ్డ ఓ దొంగ జడ్జిగారు తీర్పు చెప్పే సమయంలో ఆమెకు ఐ లవ్ యూ చెప్పేశాడు. ఆ వివరాలు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చోరీకి పాల్పడిన నిందితులు  జైలుకెళ్లి కటకటాల వెనుక శిక్ష అనుభవిస్తారు. కొందరు ఇకనైనా మారుదాం అని నిర్ణయించుకుంటే మరికొందరు వారి నేరప్రవృత్తిని కొనసాగిస్తారు. ఫ్లోరిడా కోర్టులో దొంగ చేసిన వింత పనికి మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తను చేసిన తప్పుకు శిక్షను ప్రకటిస్తున్నప్పుడు జడ్జికి లైన్ వేసి మరో తప్పు చేశాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పలువురు ఆ ప్రబుద్ధుడి తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. 


ఇదీ చదవండి: Viral Video: కళ్లు తెరిచి మూసేలోగా రంగు మారుస్తున్న చేప..వీడియో చూడండి..!


ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీ కోర్టు ఈ వింత ఘటనకు సాక్షిగా నిలిచింది . వీడియోలో ఒకవైపు దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న డెమెట్రియస్ లూయిస్ అనే దొంగ, తన కేసు కోర్టు విచారణను నిర్వహిస్తున్న మహిళా న్యాయమూర్తి తబితా బ్లాక్‌మన్‌కు లవ్ ప్రపోజ్ చేశాడు. న్యాయమూర్తి వర్చువల్ కోర్టు ద్వారా తీర్పును చదవతుండగా, మీరు చాలా అందంగా ఉన్నారు ఐ లవ్ యూ అంటూ లవ్ ప్రపోజల్ చేశాడు. ఇలా తాను చేసిన నేరానికి శిక్షను ప్రకటిస్తున్నది కోర్టు న్యాయమూర్తితో నిందితుడు అనుచితంగా ప్రవర్తించాడు.  



నిందితుడు అలా అనడంతో కాస్త కలవరపడిన మహిళా న్యాయమూర్తి.. అనంతరం నవ్వేశారు.  ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, మిలియన్ల మంది వీక్షించారు.


 


ఇదీ చదవండి: Social Media Viral: ఫాస్టెస్ట్ రూట్ అని గూగుల్ మ్యాప్ ను గుడ్డిగా నమ్మాడు.. చివరికి ఆ వ్యక్తిని ఎక్కడికి తీసుకెళ్లిందో తెలుసా?


లూయిస్ చోరీకి,కోర్టులో అతని వింత ప్రవర్తనకు న్యాయమూర్తి తబిత 5 వేల డాలర్ల జరిమానా చెల్లించాలని ఆదేశించారు. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం లూయిస్ ఇప్పటికే 4 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. జడ్జితో దురుసుగా ప్రవర్తించినందుకు అతను తన దారుణమైన ప్రవర్తనతో ట్రోల్స్‌కు గురి అయ్యాడు. మొత్తానికి ఈ ఫన్నీ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి సందడి చేస్తోంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook