Viral Photo: ఈ ఫోటోలోని జంతువును కనిపెట్టడం అంత ఈజీ కాదు గురూ..!
Viral Photo: నెట్టింట రకరకాల ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో ఒక ఫోటో ఫజిల్ మీకోసం.
Viral Photo: సోషల్ మీడియా పుణ్యమా అని..ప్రపంచంలో ఏ వింత జరిగినా క్షణాల్లో నెట్టింట దర్శనమిస్తోంది. ఫోటోలు, వీడియోలు, పజిల్స్.. ఇలా ప్రతిదీ నెట్టింట వైరల్ (Viral) అవుతోంది. ముఖ్యంగా ఫోటో పజిల్స్ (Photo Puzzles)పై చాలా మంది ఇంట్రెస్టెంట్ చూపిస్తున్నారు. అందులో ఏ జంతువు/వస్తువు దాగుందో కనిపెట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. తగ్గేదేలే అన్నట్లుగా పజిల్‌ను ఓ చూపు చూస్తున్నారు. దాన్ని తీక్షణంగా చూస్తేనే గానీ మనం గుర్తించలేం. ఈ క్రమంలోనే కొన్ని ఫోటో పజిల్స్ సోషల్ మీడియా(Social Media)లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట హాల్ చల్ చేస్తోంది.
ఈ ఫోటోలో ఓ జంతువు దాగుంది. అదెక్కడుంతో మీరు కనిపెట్టాలి. అయితే మొదటిగా మనం ఆ పిక్ (Viral Pic) చూసినప్పుడు అదొక చెట్టు బెరడులా కనిపిస్తోంది. దానిని కొంత మంది మెుసలి అని కూడా అనుకోవచ్చు. అసలు నిజం ఏంటంటే...అక్కడ ఓ పురుగు ఉంది. మనం తీక్షణంగా చూస్తే కానీ దానిని కనిపెట్టలేం. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు సమాధానం దొరక్కపోతే క్రింద ఫోటోను చూడండి.
Also Read: Hair Cut in Space: అంతరిక్షంలో హెయిర్ కటింగ్, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి