Thief Ran Into Glass: దుకాణంలో చోరీ చేయడానికి వచ్చిన ఒక దొంగ.. దుకాణంలోంచి పారిపోతూ పారిపోతూ అడ్డంగా దొరికిపోయాడు. ఖరీదైన వస్తువులు చోరీ చేసుకుని వెళ్లే క్రమంలో దుకాణానికి ఓవైపున ఏర్పాటు చేసిన గ్లాస్ ని ఢీకొని కిందపడిపోయాడు. చూడ్డానికి అచ్చం సినీ ఫక్కీలో జరిగిన కామెడీ సీన్ ని తలపించే ఈ దృశ్యం చూస్తే ఎవరికైనా నవ్వు ఆగదు. అమెరికా రాజధాని వాషింగ్టన్ లో బెల్లెవ్యూ ప్రాంతంలోని లూయిస్ ఉయిటన్ స్టోర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్టోర్ లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఈ దృశ్యాలను ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెల్లెవ్యూ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ చోరీ కేసులో పట్టుబడిన నిందితుడిని 17 ఏళ్ల జువైనల్ గా గుర్తించారు. పట్టుబడిన నిందితుడు జువైనల్ కావడంతో పోలీసులు అతడి వివరాలను సైతం గోప్యంగా ఉంచారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. యువకుడు స్టోర్‌లోకి ప్రవేశించి డిస్ ప్లేలో ఏర్పాటు చేసిన 18 వేల డాలర్ల విలువైన హ్యాండ్ బ్యాగ్స్ ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. చోరీ చేసిన బ్యాగులతో పారిపోయే క్రమంలో దుకాణంలోంచి బయటికెళ్తున్నాననుకుని గ్లాస్ మీదకు పరిగెత్తాడు. గ్లాస్ ని చూసి దుకాణం తెరిచి ఉంచిన భాగం అని పొరపడ్డాడని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. 


బెల్లెవ్యూలో షాపింగ్ మాల్స్‌లో, స్టోర్స్‌లో చోరీ ఘటనలు ఎక్కువైపోయాయి. కొంతమంది దొంగలు అంతా ముఠాలుగా ఏర్పడి ఈ చోరీలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. లూయిస్ ఉయిటన్ స్టోర్‌లో చోరీకి పాల్పడుతూ అడ్డంగా పట్టుబడిన దొంగ కూడా ఆ ముఠాలకు చెందిన వాడేనని బెల్లెవ్యూ పోలీసులు పేర్కొన్నారు. షాపింగ్ మాల్స్, దుకాణాలే లక్ష్యంగా చేసుకుని ముఠా ఈ తరహా చోరీలకు పాల్పడుతున్నట్టు బెల్లెవ్యూ పోలీసు కెప్టేన్ రాబ్ స్ప్రింగ్లర్ చెప్పినట్టుగా కోమో న్యూస్ వెల్లడించింది.



 


ది న్యూ యార్క్ పోస్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు ఈ తరహా ఘటనల్లో 50 మందికిపైగా నేరస్తులను పట్టుకున్నట్టు తెలుస్తోంది. పట్టుబడిన వాళ్లంతా మళ్లీ మళ్లీ నేరం చేస్తూ పట్టుబడిన వాళ్లేనని పోలీసులు స్పష్టంచేశారు. ఈ తరహా ఘటనలకు చెక్ పెట్టడానికి తాము పకడ్బందీ చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. గతేడాది సెప్టెంబర్ చివరి నాటికి 131 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి 63 కేసులే నమోదయ్యాయి. అంటే 52 శాతం నేరాలను అదుపు చేయగలిగాం అని బెల్లెవ్యూ పోలీసు కెప్టేన్ రాబ్ స్ప్రింగ్లర్ తెలిపారు.


Also Read : SBI Custmoers Alert: ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక.. మీకూ ఇలాంటి మెసేజెస్ వస్తున్నాయా ?


Also Read : Lizard Eating Watermelon: బల్లితో కలిసి పుచ్చకాయ తింటున్నాడు.. వైరల్ వీడియో


Also Read : Crocodile Attacks Cow: నీళ్లు తాగడానికి వచ్చిన ఆవును పట్టిన మొసలి.. తర్వాతేం జరిగిందో మీరే చూడండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook