Scooty theft video: ఇంటర్నెట్​లో రోజూ వందల వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. అయితే అందగులో ఓ ఆసక్తికరమైన వీడియో గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోజు రకరకాల దొంగతనాల గురించి మనం వింటుంటాం. అయితే ఎప్పుడైన ఓ కర్ఛిఫ్ సహాయంతో స్కూటిని దొంగిలించడం ఎప్పుడైనా చూశారా? అదేమిటి కర్చీఫ్ సహాయంతో స్కూటీ దొంగిలించడమా? ఆశ్చర్యంగా ఉంది కదు. మరి ఆ సంగతేమిటో తెలియాలంటే.. ఈ కథనం పూర్తిగా చదవాల్సింది.


రోడ్డు పక్కన ఆపి ఉన్న స్కూటర్​ను ఎత్తుకెల్లేందుకు ఓ దొంగ దాని వద్దకు వచ్చాడు. చుట్టు పక్కల ఎవరూ కనిపించకపోవడంతో కీ ఉందేమో అని వెతికి చూశాడు. అయితే ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో ఓ సింపుల్​ ట్రిక్​ను ఉపయోగించాడు. జేబులోంచి ఓ కర్చిఫ్ తీసి.. స్కూటీ సైలెన్సర్​ను మూసేసే.. అక్కడి నుంచి వెళ్లి పోయాడు.


కొద్ది సేపటి తర్వాత ఆ స్కూటీకి సంబంధించిన యువతి అటు నుంచి వచ్చింది. స్కూటీని స్టార్ట్​ చేసేందుకు ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. పెట్రోల్ అయిపోయిందేమో అని చెక్ చేసుకుంది. అయితే అంతా సరిగ్గానే ఉంది కాని స్కూటీ ఎందుకు స్టార్​ అవడం లేదు అనేది ఆమెకు అర్థం కాలేదు.


సరిగ్గా ఇదే సమయంలో సైలెన్సర్​కు కర్చిఫ్ పెట్టిన దొంగ అటుగా వచ్చాడు. ఏమి తెలియనట్టు నటిస్తూ.. అమెకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఆ యువతి ముందు కాసేపు స్కూటిని స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించినట్లు నటించాడు. ఇదిలా ఉంటగా.. ఆ యువతి స్కూటీ స్టార్ అవడం లేదనే విషయాన్ని తమ వాళ్లకు సమచారం ఇవ్వడం కోసం ఫోన్​లో బిజీగా మారింది.


ఆ యువతి అటుగా మళ్లడం చూసిన దొంగ సైలెన్సర్​లో కుక్కిన కర్చిఫ్​ను తీసీ స్కూటర్​ను ఎత్తుకెళ్లాడు. ఆ యువతి వెనక్కు మళ్లి స్కూటర్​ తీసుకెళ్తున్న దొంగపై కేకలు వేసింది.


నిమిషం కన్నా తక్కువ నిడివి ఉన్న ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనేది తెలియరాలేదు. ఇది నిజంగానే జరిగిందా? ప్రాంక్​ కోసం చేసిందా? అనే విషయంపై కూడా క్లారిటీ లేదు. నెజిటన్లు మాత్రం ఇలా కూడా చోరీ చేస్తారా అని ఆశ్చర్యపోతున్నారు. black_lover__ox అనే ఇన్​స్టా ఐడీలో ఈ వీడియోను షేర్​ చేశారు.



Also read: Viral Video: నువ్వు నన్ను కెలికితే..నేనెందుకు ఊరుకుంటాను, వైరల్ అవుతున్న వీడియో


Also read: Bizarre News: చెవిలో బొద్దింకతో మూడ్రోజులు నరకయాతన, ఆ తరువాత ఏమైంది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook