Dating: ``వామ్మో.. 9 th క్లాసు పుస్తకంలో డేటింగ్ పై పాఠాలు..?..` సోషల్ మీడియాలో ఏకీపారేస్తున్న నెటిజన్లు..
Viral news: 9వ తరగతి విద్యార్థుల కోసం వాల్యూ ఎడ్యుకేషన్ పుస్తకాలను CBSE ప్రవేశపెట్టింది. దీనిలో డేటింగ్, రిలేషన్ షిప్ గురించి ప్రత్యేకంగా చాప్టర్లు పెట్టారు. దీంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
A Chapter On Dating And Relationships: సాధారణంగా పాఠ్యపుస్తకాలలో స్వాతంత్ర సమరయోధులు లేదా చరిత్రలోని రాజుల పాఠ్యాంశాలు ఉంటాయి. అదే విధంగా మన దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయుల జీవిత చరిత్రలు పాఠ్యాంశాలుగా ఉండటం మనం చూస్తుంటాం. విద్యార్థులు చిన్న తనం నుంచే మంచి జీవిత చరిత్రలను క్లాసులో బోధిస్తుంటారు. దీంతో పిల్లలు చిన్నతనం నుంచే మంచి ఆలోచనలతో ప్రభావితమై భవిష్యత్తులో ఉన్నతమైన వ్యక్తులుగా ఎదుగుతారని చెబుతుంటారు.
కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న ఘటన దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. సీబీఎస్ఈ తాజాగా రూపొందించిన పుస్తకం తొమ్మిదో తరగతి సిలబస్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది. తొమ్మిదో తరగతి లో డేటింగ్, రిలేషన్ షిప్ గురించి ఒక పాఠ్యాంశంగా చేర్చారు. ప్రస్తుతం ఇది వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.
దీనిపై టిండర్ ఇండియా స్పందిస్తూ.. చిన్న పిల్లలకు బోధించాల్సిన పుస్తకంలో ఇవేంటని ప్రశ్నించింది. యుక్త వయసులో వచ్చాక కొన్ని విషయాలు అవే తెలుస్తాయని చెప్పుకొచ్చింది. చిన్న పిల్లలకు మనస్సులు దీని వల్ల ప్రభావితమౌతాయని కూడా పలు వ్యాఖ్యలు చేసింది.
ఇప్పుడు డేటింగ్, రిలేషన్ షిప్ పాఠాలు పెట్టారు.. ఆ తర్వాత ప్రేమ, బ్రేకప్ వంటివి కూడా పెడతారా అని.. టిండర్ ఇండియా సెటైరిక్ గా ప్రశ్నించింది. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్న చూసిన నెటిజన్ లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook