Three Headed Cheetah: కొన్ని ఫోటోలు చూడగానే మనల్ని మంత్ర ముగ్ధులను చేస్తాయి. చూపు పక్కకు తిప్పుకోనివ్వని రీతిలో మనల్ని కట్టిపడేస్తాయి. ముఖ్యంగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో అలాంటి చిత్రాలు మనకు చాలా కనిపిస్తాయి. తాజాగా ఓ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ తీసిన 'చిరుత' ఫోటో అందరినీ కట్టిపడేస్తోంది. ఈ ఫోటో చూస్తే ఎవరైనా థ్రిల్‌కి గురికావాల్సిందే అనడంలో అతిశయోక్తి లేదేమో..!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడు తలల చిరుత :


ఈ అద్భుతమైన ఫోటోను కెన్యాలోని (Kenya) మసాయి మారా (Maasai Mara) నేషనల్ పార్క్‌లో 'పాల్ గోల్డ్‌ స్టెయిన్' అనే వైల్డ్‌ లైఫ్ ఫోటోగ్రాఫర్ తీశాడు. ఫోటోలో ఒకే చిరుత మూడు తలలతో ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ ఆ ఫోటోలో ఉన్నది మూడు చిరుతలు. ఆ అద్భుతమైన చిత్రాన్ని కెమెరాలో బంధించేందుకు గోల్డ్ స్టెయిన్ ఏడు గంటల పాటు వర్షంలో గడపాల్సి వచ్చింది.


గోల్డ్ స్టెయిన్ ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఈ మూడు తలల చిరుత (Cheetah) ఫోటో నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ ఫోటోకి ఇప్పటివరకూ 2వేల పైచిలుకు లైక్స్ 150కి పైగా షేర్స్ వచ్చాయి. ఈ ఫోటో చూశాక చాలామంది గోల్డ్ స్టెయిన్ ఫోటోగ్రఫీ టాలెంట్‌ను కొనియాడకుండా ఉండలేకపోతున్నారు. ఇంత అద్భుతమైన ఫోటో తీసిన అతను ప్రశంసలకు అర్హుడని కామెంట్ చేస్తున్నారు.



Also Read: MP Arvind: ఎంపీ అరవింద్‌కు లోక్‌సభ స్పీకర్ ఫోన్.. ఇటీవలి దాడిపై ఆరా...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook