OMG Video: హార్స్ రేసింగ్ ట్రాక్ పైకి మెుసలి...భయంతో వణికిపోయిన గుర్రం, వీడియో వైరల్
Today Viral Video: నెట్టింట జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియోను ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Today Viral Video: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో పాము, పులి, సింహం, మెుసలి, ఏనుగు వంటి జంతువులకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో (Viral Video) ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
గుర్రం రేస్ గురించి మనందరికీ తెలిసిందే. గ్యాలరీలో జనాలందరూ కూర్చుంటే... గుర్రాలన్నీ రేసులో పరిగెడుతుంటాయి. ఈ గుర్రాలకు నంబర్ల ఉంటాయి. వీటిపై బెట్టింగ్స్ కాస్తూ ఉంటారు. తాజాగా లూషియానాలో రేస్ ట్రాక్ Horse Racing Track) లో షాకింగ్ ఘటన జరిగింది. గుర్రం పరిగెత్తే ట్రాక్ పైకి సడన్ గా ఓ పెద్ద మెుసలి దర్శనమిచ్చింది. దీంతో ఒక్కసారిగా గుర్రం, ఆశ్వాన్ని పట్టుకున్న వ్యక్తి భయపడతారు. ఆ ఎలిగేటర్ (Alligator)ను చూసి గుర్రం హ్యాండర్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాసేటికే ఆ మెుసలి నెమ్మదిగా నడుచుకుంటూ ట్రాక్ దాటుతుంది.
ప్రస్తుతం ఈ వీడియా ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవుతోంది. 10 సెకన్ల నిడివి గల ఈ వీడియో రేసింగ్.కామ్ (Racing.com) అనే ట్విట్టర్ పేజీలో షేర్ చేయబడింది. ఈ క్లిప్‌ను ఇప్పటివరకు 36వేల మందికిపైగా వీక్షించారు. అంతేకాకుండా 747 లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
Also Read: వరుడు లేకుండా వివాహం చేసుకుంటున్న 24 ఏళ్ల యువతి.. గోవాలో హనీమూన్ ప్లాన్! చరిత్రలో ఇదే మొదటిసారి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook