24 Carat Gold Dress: 24 క్యారెట్ల బంగారంతో చేసిన డ్రెస్సు ధరించిన పెళ్లి కూతురు, ఫోటోలు వైరల్
Bride Dress: సాధారణంగా పెళ్లి అవుతుదంటే...మిడిల్ క్లాస్ వాళ్ల అయితే వందల్లోనూ, వేళ్లలోనూ డ్రెస్సులు తీస్తుంటారు. ధనవంతులైతే లక్షల్లో ఖర్చు చేస్తుంటారు. కానీ అమెరికాకు చెందిన ఓ వధువు 24 క్యారెట్ల బంగారంతో చేసిన డ్రెస్స్ ధరించి అందరినీ షాక్ కు గురిచేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Bride's 24 Carat Gold Dress: వివాహం అనేది ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన క్షణం. పెళ్లిలో అందంగా కనిపించాలని పెళ్లి కొడుకు, పెళ్లికూతురు కోరుకుంటారు. అందుకే ఖరీదైన డ్రెస్సులు, జ్యూయిలరీ ధరిస్తారు. తాజాగా ఓ పెళ్లిలో వధువు (Bride) ధరించిన డ్రెస్స్ అక్కడి ఉన్నవారిని షాక్ కు గురిచేసింది. ఎందుకంటే ఆమె 24 క్యారెట్ల బంగారంతో చేసిన గౌను (Bride's 24 Carat Gold Dress) ధరించింది. దీంతో అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఇప్పడు ఆమె ధరించిన దుస్తులు నెట్టింట (internet) వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఆ పెళ్లి కూతురు ధరించిన దుస్తులు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
ఆ వధువు పేరు కైలా. అమెరికాకు చెందిన ఈమె 24 ఏళ్ల టిమ్మీని వివాహం చేసుకుంది. తన పెళ్లిని మరింత అందంగా మార్చడానికి ఈమె గోల్డెన్ డ్రస్ (Golden dress) ధరించింది. దీని కోసం చాలానే డబ్బును వెచ్చించింది. ఈ వివాహ దుస్తులను డిజైన్ చేసే బాధ్యతను ఫ్యాషన్ డిజైనర్ సోండ్రా సీలీకి అప్పగించారు. ఇంతకు ముందు సౌంద్ర అలాంటి దుస్తులను డిజైన్ చేయలేదు. అయితే 24 క్యారెట్ల గోల్డ్ గౌను తయారు చేయాలనే ఆర్డర్ రాగానే సౌంద్ర దానిని ఛాలెంజ్‌గా తీసుకుంది. మనసు పెట్టి మరి ఈ డ్రెస్స్ ను డిజైన్ చేసింది. పెళ్లి కూతురు ఆ దుస్తులు ధరించగానే అక్కడ ఉన్నవారంతా ఆమెనే చూస్తూ ఉండిపోయారు. ఇంతకముందు ఎప్పుడూ అలాంటి దుస్తులు చూడకపోవడంతో అక్కడ ఉన్న జనమంతా అవాక్కయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook