Chameleon: అద్భుతం.. మహా అద్భుతం.. చనిపోయిన ఊసరవెల్లిని బ్రతికించిన ఘనుడు.. క్రేజీ వీడియో
కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి.. ఏ ప్రాణి అయిన చనిపోతే తిరిగి బ్రతికించలేము. కానీ ఒక వ్యక్తి.. ఆశని కోల్పోకుండా ప్రయత్నించి.. చనిపోయిన ఒక ఊసరవెల్లిని తిరిగి బ్రతికించాడు. ఆ వీడియో..
Today's Viral Video: పూర్తిగా ముగిసేవరకు దేన్నీ వదొలొద్దు.. అంటే దేన్నైనా సరే త్వరగా వదిలేయొద్దు.. ప్రయత్నిస్తేనే విజయం మన వశం అవుతుంది. చాలా మంది ఏ పైనైనా ప్రయత్నం చేయకుండానే అసాధ్యమని భావిస్తారు. కానీ సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. మనసును కదిలించే ఈ వీడియో.. నమ్మటానికి అసాధ్యం అనిపించే పనిని సాధ్యం చేసి చూపించాడు.
పొదల్లో నేలపై చనిపోయిన ఉన్న ఊసరవెల్లిని చూసాడు.. దానికి తిరిగి ప్రాణం పోశాడు. పూర్తిగా జరిగిన ఈ ప్రక్రియ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది, వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది.
చనిపోయిన ఊసరవెల్లిని బ్రతికించాడు..
చనిపోయిన ఏ ప్రాణిని కూడా మనం తిరిగి బ్రతికించలేము.. అది వైద్యులకు కూడా అసాధ్యం అనే చెప్పాలి. కానీ ఒక వ్యక్తి.. చనిపోయిన ఊసరవెల్లిని బ్రతికించిన వీడియో అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తుంది.
వీడియోలో.. ఒక ఊసరవెల్లి పొదల్లో చనిపోయి ఉంటుంది.. ఆ వ్యక్తి చనిపోయిన ఊసరవెల్లిని తీసుకొని నీటిని పోస్తూ.. దాని శరీరంపై కాస్త మసాజ్ చేస్తూ తడుముతాడు. అంతేకాకుండా.. తన నోటి ద్వారా ఊసరవెల్లి నోట్లోకి శ్వాస అందించే ప్రయత్నం చేస్తాడు. మళ్లీ ఊసరవెల్లిని కింద పడుకోబెట్టి.. నీటిని పోస్తూ.. మసాజ్ చేస్తాడు.. అపుడు కాస్త కొద్దీగా ఊసరవెల్లి కింది దవడ కదిలించటం మనం చూడవచ్చు. తరువాత కారులో తన ఇంటికి తీసుకెళ్తాడు.. ఇంట్లో దానికి తగిన వైద్య సంరక్షణ విధానాలను అందిస్తాడు. అలా చేయటంతో ఊసరవెల్లి శరీరంలో చిన్న చినన్ మార్పులతో పాటు చిన్న కదలికలు ప్రారంభం అవుతాయి, చేసిన వ్యక్తికీ ఏమో కానీ.. చూసే ప్రతి ఒక్కరిలో తెలియని ఒక సంతోషం.. నాకైతే చనిపోయిన ప్రాణి మళ్లీ బ్రతకరం ఏంటనే ఒకంత ఆశ్చర్యం.
అలా కొంత సమయం గడిచిన తరువాతా ఊసరవెల్లి పూర్తిగా ఊపిరి పీల్చుకోవటం మనం చూడవచ్చు. అలా కొంత సమయంలోనే ఆ వ్యక్తి సెల్ఫీ తీసుకుంటూ ఉంటే అతడి ఫోన్ ఎక్కి కూర్చుంటుంది. అది మనం వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.
Also Read: Hyderabad: ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి చంపేసిన తండ్రి.. వెంటనే తానూ కూడా..!
ఈ వీడియోలో మనకు తెలిసిందేంటంటే.. ఏ పనినైనా ఒక నిష్ఠతో, నియమ బద్దంగా చేస్తే పక్కాగా విజయం సాధించవచ్చని తెలుస్తుంది. అంతేకాకుండా ప్రతి జీవికి భూమ్మీద సమన హాక్కుతో పాటు జీవించే అర్హులని తెలుస్తుంది.
వీడియోపై ప్రజలు స్పందన
ఈ వీడియో @TheFigen_ అనే ఖాతా ద్వారా Xలో పోస్ట్ చేసారు. ఇప్పటి వరకు 8 మిలియన్లకు పైగా వ్యూస్ రాగా.. 1 లక్ష 32 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయి. నేను మీతో ఒక విషయం పంచుకుంటాను. @alifewithoutus అనే వినియోగదారు ఇలా వివరించాడు.. "ఈ ప్రక్రియను అన్‌హైడ్రోబయోసిస్ అని పిలుస్తారు, దీని వలన ఊసరవెల్లి విపరీతమైన నిర్జలీకరణాన్ని లోనైనప్పుడు దాదాపు మరణం అంచున ఉంది. ఈ సమయంలో దాని జీవక్రియ ప్రక్రియ మందగిస్తుంది మరియు దాదాపు ఆగిపోతుంది. ఫలితంగా నిర్జీవంగా కనిపిస్తాయి. అయితే, రీహైడ్రేట్ చేయబడినప్పుడు, ఊసరవెల్లులు తమ సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరించగలవు మరియు తిరిగి ప్రారంభించగలవు. పొడి వాతావరణంలో జీవించడానికి వీలు కల్పించే అద్భుతమైన అనుసరణను ప్రదర్శిస్తాయి. కొరత ఉన్నచోట నీటిని సృష్టిస్తుంది" అని తెలిపారు.
Also Read: Green Tea Vs Black Coffee: గ్రీన్ టీ, బ్లాక్ టీ మధ్య తేడాలు తెలుసా.. ఆరోగ్యానికి ఏది మంచిదంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయంTwitter , Facebook