Viral Video: బైకర్‌ను బలితీసుకున్న బండరాయి... మృత్యువు రూపంలో ఎలా దూసుకొచ్చిందో చూడండి
Biker Dies After Huge Rock Hits: మృత్యువు ఎప్పుడు.. ఎక్కడ... ఎలా కబళిస్తుందో చెప్పలేమనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ఘాట్ రోడ్డుపై బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని మృత్యువు రూపంలో దూసుకొచ్చిన బండరాయి బలితీసుకుంది.
Biker Dies After Huge Rock Hits: కేరళలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొండ పైనుంచి దొర్లుతూ వచ్చిన పెద్ద బండరాయి ఘాట్ రోడ్డుపై వెళ్తున్న బైకర్‌పై పడింది. బండరాయి ఫోర్స్‌కి ఆ బైకర్ అమాంతం ఎగిరి పక్కన పడిపోయాడు. తీవ్ర గాయాలవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మృతి చెందిన ఆ బైకర్‌ను మలప్పురంకు చెందిన యువకుడి (20)గా గుర్తించారు. ఘాట్ రోడ్డులోని ఓ మూల మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆ బైకర్ వెనకాలే వెళ్తున్న మరో బైకర్ ఈ ప్రమాదాన్ని తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. కళ్ల ముందే జరిగిన ప్రమాదాన్ని చూసి... అతను కొద్ది దూరంలో ఆగిపోయాడు. మరణం ఎప్పుడు ఎలా ఎదురవుతుందో చెప్పలేమనడానికి ఈ ఘటనే ఉదాహరణ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: SVP Story: 'సర్కారు వారి పాట'... కథలో అసలు పాయింట్స్ రివీల్ చేసిన ఎడిటర్...
Also Read: Minister KTR on AP: ఏపీపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ వివరణ... ఏం చెప్పారంటే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook